Pooja Hegde: పెగ్గు కలుపుతూ చిందులేస్తున్న పూజా హెగ్డే.. వీడియో వైరల్..!

మద్యపానం ధూమపానం.. ఆరోగ్యానికి హానికరమని… సినిమా మొదలయ్యే ముందు సినిమాలో తాగే పాత్రతో చెప్పిస్తూ ఉంటారు. అలాగే సినిమాలో మందు తాగే సీన్ వచ్చినప్పుడు కూడా ఆ లైన్ ను వేస్తుంటారు. ఇది ప్రభుత్వ ఆదేశాల మేరకు చేస్తుంటారు సినిమా వాళ్ళు. సినిమా అనే ఏ విషయాన్ని అయినా జనాలని ఆలోచింపచేసేలా చేస్తుంది.. ఒక్క మాటలో చాలా ప్రభావితం చేస్తుంది అంటారు. కానీ ఈ మద్యపానాన్ని అరికట్టే విషయంలో మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేకపోతుంది సినిమా.

అలాగే సినిమా వాళ్ళు వీటికి దూరంగా ఉంటారని చెప్పలేము. కానీ వాళ్ళు ప్రత్యక్షంగా మందుకొడితే మాత్రం.. చాలా మంది దానిని మాదిరికరంగా తీసుకునే ప్రమాదం ఉంది. అందుకే సినిమాల్లో నటించేవాళ్ళు ఈ విషయంలో ఓపెన్ అవ్వరు.ఏ రాంగోపాల్ వర్మ లాంటివాళ్ళో తప్ప. కానీ ఇటీవల కాలంలో హీరోయిన్లు ఎక్కువగా విస్కీ, వైన్ వంటివాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా చేస్తూ విమర్శల పాలవుతున్నారు. రెజీనా, ఇలియానా వంటి వారి పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.మొన్నటికి మొన్న కాజల్ కూడా తన భర్తకి మందు తాగమని చెబుతూ పోస్ట్ పెట్టింది.

ఇదే భీభత్సం అనుకుంటే తాజాగా బుట్టబొమ్మ పూజా హేగ్దే అంతకు మించి అన్నట్టు వ్యవహరిస్తోంది. రెడ్ అంటూ జింజర్ చాలెంట్ అంటూ పెగ్గులు కలుపుతూ డ్యాన్స్ చేస్తూ ఓ వీడియోని విడుదల చేసింది పూజా హెగ్డే. ఇది కేవలం 25 ఏళ్లు నిండిన వారికే,బాధ్యతాయుతంగా తాగండంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీని పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!


టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus