తనకి నచ్చే మగాళ్ల గురించి చెప్పిన పూజా హెగ్డే

ముకుంద సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే పక్కింటి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన “ఒక లైలా కోసం”లో కూడా చక్కని నటనతో ఆకట్టుకుంది. అయినా తన కెరీర్ ఊపందుకోలేదు. హిందీ సినిమా చేసినా మంచి ఫలితం దక్కలేదు. దీంతో దువ్వాడ జగన్నాథంలో స్టైల్ మార్చింది. గ్లామర్ డోస్ పెంచింది. బికినీ అందాలతో అందరినీ పడగొట్టేసింది. ఇంకేముంది స్టార్ హీరోల పక్కన ఆఫర్లు వరుసగా అందుకుంటోంది. రంగస్థలంలో చరణ్ తో కలిసి జిగేల్ రాణిగా కవ్వించైనా బ్యూటీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాని పూర్తి చేసి స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఇదే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి మహర్షిలో నటిస్తోంది.

తాజాగా ప్రభాస్ 20 వ సినిమాలోనూ హీరోయిన్ ఛాన్స్ అందుకుంది. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్క నున్న ఈ మూవీ ఈనెల 6 న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె తనకి ఎటువంటి వారు ఇష్టమో వెల్లడించింది. ”తెలివైన వాళ్లని బాగా ఇష్టపడతా. సున్నితత్వం కలిగి ఉండాలి. మంచివాళ్లైతే ఇంకా మంచిది. హాస్య చతురత బాగుండాలి. ఎలాంటి వాతావరణాన్ని అయినా తన మాటతో ప్రశాంతంగా మార్చేయాలి. డ్రస్సింగ్‌ సెన్స్‌ తెలిసుండాలి. హుందాగా ఉండాలి” అంటూ పూజా వివరించింది. ఆమె చెప్పిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయి ఎక్కడ ఉంటారో.. ఎప్పుడు పూజ కంటపడుతారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పూజా రియల్ లైఫ్ లవ్ స్టోరీ అప్పుడే కదా మొదలవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus