రంగస్థలంలో సాంగ్ కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్న పూజా

సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ కలిశారంటే మాస్ అభిమానాలకు ఐటెం సాంగ్ రూపంలో స్పెషల్ మీల్స్ పెట్టకుండా వదలరు. ‘అ అంటే అమలాపురం’, ‘డియాలో డియాలో’, ‘రింగ రింగ’ అంటూ గతంలో థియేటర్లో ప్రేక్షకులను చిందులేయించిన ఈ కాంబినేషన్లో మరో పాట సిద్ధమవుతోంది. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ హీరోగా రంగస్థలం సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మిగిలిన “జిల్‌ జిల్‌ జిగేల్‌” అనే ప్రత్యేక పాటని తెరకెక్కిస్తున్నారు. ఇందులో చీర కట్టులో డీజే బ్యూటీ పూజా హెగ్డే చరణ్ తో కలిసి స్టెప్పులు వేస్తోంది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ లో ఈ పాట షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే ఈ పాట కోసం పూజ తీసుకున్న పారితోషికం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె స్పెషల్ సాంగ్ చేయడానికి 50 లక్షలు తీసుకున్నట్లు టాక్. టాలీవుడ్ యువరాణిగా పేరు దక్కించుకున్న కాజల్‌ “జనతా గ్యారేజ్‌” సినిమాలో చేసిన సాంగ్ కోసం 50 లక్షలు తీసుకున్నారని అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన పూజా 50 లక్షలు తీసుకోవడాన్ని అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. మాస్ ప్రేక్షకులను థియేటర్ కి రప్పించాలంటే ఆ మాత్రం సమర్పించుకోవాల్సిందేనని సమర్ధించేవాళ్లు లేకపోలేదు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 30 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus