Bigg Boss 7 Telugu: సినిమా టాస్క్ లో లొల్లి..! పూజ శోభాని ఎంత మాటందంటే.?

బిగ్ బాస్ హౌస్ అంటే టాస్క్ లు ఆ టాస్క్ లలో హౌస్ మేట్స్ గొడవలు. ఈ గొడవల మద్యలో నోటికి ఎంత మాట వస్తే అంత మాటా అనేస్తారు. ఆ తర్వాత మళ్లీ కలిసిపోతారు. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ తో కూడిన ఈ రియాలిటీ షో ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది. ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు అంటూ బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ తో గేమ్స్ ఆడిస్తున్నాడు. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఈవారం కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు. సినిమాలో ఫేమస్ డైలాగ్స్, సాంగ్స్ ప్లే చేస్తూ ప్రశ్నలు సంధించాడు.

అందుకు జవాబుగా ట్రేలో ఉన్న ఫోటోలు తీసి హౌస్ మేట్స్ మ్యాగ్నెటిక్ బోర్డ్ కి అంటించాలి. ఇక్కడే శోభా ఇంకా పూజా ఇద్దరూ గొడవ పడ్డారు. ఒకే టైప్ లో ఉన్న రెండు ఫోటోలు తీసుకుని శోభా చీటింగ్ గేమ్ ఆడింది. పోటుగాళ్లు చెప్తున్నా కూడా శోభా వినిపించుకోలేదు. ఇది నా గేమ్, నా స్ట్రాటజీ అంటూ రెచ్పిపోయింది. దీంతో బిగ్బాస్ ఆ రౌండ్ ని క్యాన్సిల్ చేశాడు. అసలు టాస్క్ లో ఏం జరిగిందంటే.,
నిజానికి పూజామూర్తి ఇంకా శివాజీ ఇద్దరూ ఆడేందుకు వచ్చారు.

బిగ్ బాస్ మగధీరలో రామ్ చరణ్ కాళభైరవగా ఉన్నప్పుడు గుర్రం పేరేంటి అని అడిగారు. దీంతో శివాజీ ఇంకా పూజా ఇద్దరూ కూడా గుర్రం కోసం పరిగెత్తారు. ఫస్ట్ శివాజీ గుర్రాన్ని తీసుకుని బోర్డ్ కి అంటించాడు. కానీ అది భైరవ నేమ్ ఉన్న గుర్రం. పూజ మాత్రం కిందపడిపోయి మరీ బాద్ షా అనే గుర్రాన్ని తెచ్చింది. దీంతో తన టీమ్ మెంబర్స్ హెల్ప్ కూడా చేశారని శోభ బిగ్ బాస్ కి కంప్లైంట్ ఇచ్చింది. గుర్రం గుర్రం అని చెప్పారని అంతేకాదు, పేరు చెప్పలేదని శోభతో పూజ ఆర్గ్యూ చేసింది.

ముందు ఫస్ట్ పూజ మెల్లగానే చెప్పింది. గుర్రం అని బిగ్ బాసే (Bigg Boss 7 Telugu) చెప్పారు మా టీమ్ మేట్స్ చెప్పినా చెప్పకపోయినా పర్లేదని చెప్పింది. అయినా కూడా శోభ రెట్టించింది. ఇద్దరూ గొడవ పడ్డారు. మాటకి మాట అనుకున్నారు. శివాజీ వదిలేశాడు కాబట్టి నేను గుర్రాన్ని తీస్కోలేదని బిగ్ బాసే చెప్పాడు గుర్రం అని మాకు తెలీదా అంటూ పూజ విరుచుకుపడింది. నేను అలా చేయలేదు.. అంటే నువ్వు చేశావ్.. అంటూ శోభా రెచ్చగొట్టింది. దీంతో అర్జున్ కి తన గోడు వినిపించుకుంది పూజ. తెలుగులో ఒక సామెత ఉంటది. మనం చేస్తే నీతి.. ఎదుటి వాళ్లు చేస్తే బూతు అంటారు అని చెప్పింది పూజ.

ఇది తర్వాత తెలుసుకున్న శోభాశెట్టి బాగా హర్ట్ అయ్యింది. నన్ను అంత మాట అంటదా ? నేను తనని ఏమీ అనలేదు కదా. ఆ సామెత నాకు ఎందుకు చెప్పాలంటూ శోభా రెచ్చిపోయింది. ఇక వీరిద్దరి గొడవ నాగార్జున ఖచ్చితంగా వీకండ్ అడుగుతారు. అలాగే, పూజ ఎందుకు శోభపై అరిచిందనేది కూడా క్లియర్ గా చూపిస్తారు. నిజానికి గుర్రం పెట్టే హడావుడిలో పూజ కింద పడిపోయింది. దాని గురించి ఎవ్వరూ జాలి కూడా పడలేదు. పైగా శోభా మాటలు విసిరింది. మరి వీకండ్ దీనిపై హోస్ట్ నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. అదీ మేటర్.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus