Poonam Kaur: త్వరలోనే ఆ విషయాలు బయటపెడతా : పూనమ్ కౌర్

టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి సెలబ్రిటీలు ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కెల్విన్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, రకుల్, రానా, రవితేజలతో పాటు నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్ లకు ఈడీ అధికారులు నోటీసులు పంపించారు.

అయితే విచారణలో భాగంగా మరికొంతమంది నటీనటుల పేర్లు బయటకొచ్చే అవకాశం కనిపిస్తుంది. తాజాగా ఈ డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన నటి పూనమ్ కౌర్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. డ్రగ్స్ అనేది ఒక్క సెలబ్రిటీల సమస్య మాత్రమే కాదని.. ప్రతి ఒక్కరి సమస్య అని.. సరిహద్దు సమస్య అని చెప్పింది. పొలిటికల్ ఎజెండాతో జరుగుతున్న వ్యవహారమని అభిప్రాయ పడింది. ఇదొక బలమైన ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన సమస్య అని..

Poonam Kaur tweet creates confusion in netzens1

ఈ మొత్తం వ్యవహారంపై త్వరలోనే తన స్వీయ అనుభవాలను మీతో పంచుకుంటాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె ఏం చెబుతుందో అని ట్విట్టర్లో చర్చలు జరుగుతున్నాయి. ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం నటిగా పెద్దగా అవకాశాలు రావడం లేదు. అప్పుడెప్పుడో ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus