Poonam Pandey: సెల్ఫీ వీడియోతో తన మరణ వార్త పై క్లారిటీ ఇచ్చిన పూనమ్ పాండే!

ప్రముఖ బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయినట్టు నిన్నటి నుండి తెగ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.దీంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూనమ్ ఇన్ స్టా ఖాతా నుండే ఈ న్యూస్ ఊపందుకుంది. ఆమె సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్)తో మృతి చెందినట్లు ఓ పోస్ట్ పడటంతో ఈ న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఆమె సన్నిహితులు కూడా పూనమ్ మృతికి చింతిస్తున్నట్టు కామెంట్లు చేశారు. కానీ ఈ విషయం గురించి అందరికీ ఊహించని షాక్ తగిలింది అనే చెప్పాలి.

‘ఏంటా షాక్?’ అంటే.. ఆమె చనిపోలేదు.. బ్రతికే ఉంది. ఓ వీడియో ద్వారా స్వయంగా పూనమ్ పాండే తన మరణ వార్త పై స్పందించడం ఇంకో షాక్ ఇచ్చే అంశం అని చెప్పాలి. అయితే గర్భాశయ క్యాన్సర్ ఎవర్ నెస్ క్యాంపెయిన్ లో భాగంగా ఆమె ఇలాంటి ప్రయోగం చేసినట్టు చెప్పి అందరికీ ఆగ్రహం తెప్పించింది అనే చెప్పాలి.ఆమె ఇన్స్టాలో వీడియోల ద్వారా మాట్లాడుతూ.. “నా మరణ వార్త వల్ల బాధ పడిన వారికి క్షమాపణలు తెలుపుకుంటున్నాను.

అయితే దేని కోసమైతే ఈ వార్తని ప్రచారం చేశామో.. అది సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాం. దానికి గర్వపడుతున్నాం కూడా. సర్వికల్ క్యాన్సర్… నా ఫేక్ మరణానికి కారణమైంది.. ఈ వ్యాధి సైలెంట్ గా మహిళల్ని చంపేస్తుంది. దీని గురించి అందరూ మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. గర్భాశయ క్యాన్సర్ బారిన నేను పడలేదు. కానీ ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం వల్ల వేలాది మంది మహిళల ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇది మిగతా క్యాన్సర్లలా కాదు, గర్భాశయ క్యాన్సర్ ను నివారించే అవకాశం ఉంది. హ్యుమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వ్యాక్సిన్, ముందస్తుగా గుర్తించే పరీక్షల వల్ల ఇది వర్కౌట్ అవుతుంది. ఈ వ్యాధి వల్ల ఏ మహిళ కూడా ప్రాణాలు కోల్పోకుండా జీవించగలిగే మార్గాలు ఉండనే ఉన్నాయి. అది అందరం తెలుసుకుందాం. ఈ వ్యాధిని నివారిద్దాం. ” అంటూ చెప్పుకొచ్చింది (Poonam Pandey) పూనమ్ పాండే.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus