మద్యం సేవించి… యాక్సిడెంట్ చేసిన నటి..!

ప్రముఖ టీవీ నటి, మోడల్ అయిన రూహి సైలేజ్ కుమార్ సింగ్… మద్యం సేవించి పోలీసుల మీదే చేయి చేసుకోవడం పెద్ద సంచలనం సృష్టించింది. దీంతో ఈమె పై కేసు నమోదయ్యింది. విషయంలోకి వెళితే.. ముంబైలో ఖార్ రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా.. సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తన స్నేహితులు రాహుల్, స్వాప్నిల్ లతో కలిసి మద్యం మత్తులో ఉన్న రూహి సింగ్ కారు నడుపుకుంటూ వచ్చి… లింక్ రోడ్డులో ఫుడ్ తినడానికి కారు ఆపి తినడానికి వెళ్ళారు. కానీ క్లోజింగ్ టైం కావడంతో హోటల్ సిబ్బంది ఫుడ్ ఇవ్వడానికి నిరాకరించారట. అయితే మద్యం మత్తులో ఉన్న రూహి వారి పై వికృతంగా ప్రవర్తించింది. దీంతో హోటల్ సిబ్బంది పోలీసులని ఆశ్రయించారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ… వారు మరింత రెచ్చిపోయి… పోలీసుల మీద చెయ్యి చేసుకున్నారు. ఆ వెంటనే వారినుండి తప్పించుకుని వేగంగా కారు నడిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఐదు కార్లు కూడా డ్యామేజ్ అవ్వడం గమనార్హం. ఈ యాక్సిడెంట్ లో ఎవరూ గాయపడక పోవడం అదృష్టమని చెప్పాలి. ఆ తరువాత పోలీసులు రూహిని అదుపులోకి తీసుకుని… బ్లడ్ సాంపిల్స్ తీసుకున్నారు.రూల్స్ ప్రకారం అర్ధరాత్రి మహిళలను అరెస్ట్ చేయకూడదు కాబట్టి ఆమె పై కేసులు నమోదు చేసి పంపించేశారట. అయితే ఆమె ఇద్దరు స్నేహితులను మాత్రం అరెస్ట్ చేశారని తెలుస్తుంది. రక్త పరీక్షలు పూర్తయిన అనంతరం రూహిని కూడా అరెస్ట్ చేసి అవకాశం ఉందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus