ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, దర్శకులు మరణించిన సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. టాలీవుడ్లోనే కాకుండా మిగిలిన భాషల నటీనటులు, ఫ్యాషన్ డిజైనర్లు, చాలా మంది మరణించారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ప్రముఖ సింగర్ మరణించడం హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..గాయని నయ్యారా నూర్ కరాచీలో కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆదివారం నాడు మరణించినట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. పాకిస్తాన్ కు చెందిన గొప్ప గొప్ప సింగర్స్ లో ఈమె కూడా ఒకరు.ఈమె వయసు 71 సంవత్సరాలు కాగా, ‘నైటింగేల్ ఆఫ్ పాకిస్తాన్'(బుల్ బుల్-ఎ-పాకిస్తాన్) అనే బిరుదును కూడా ఈమె పొందింది. నూర్…1950 వ సంవత్సరంలో నవంబర్ లో భారతదేశంలోని గౌహతి(అస్సాం)లో జన్మించింది. బాల్యంలోనే ఆమె కుటుంబం… పాకిస్తాన్ రాజధాని కరాచీకి మకాం మార్చడంతో అక్కడే ఆమె పెరిగింది.
లాహోర్ లోని ‘నేషనల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్’ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత.. 60లలో బుల్లితెర పై ఆమె సింగర్ గా కెరీర్ ను మొదలు పెట్టింది. నూర్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన నూర్.. ప్రసిద్ధ విప్లవ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన రచనలను 1976లో ఆలపించి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. 2012 వరకు నూర్ పాటలు పాడారు.అప్పటి నుండి పాడడం మానేశారు. ఈమె మరణం తీరని లోటు అని సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.