శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన హ్యాపీడేస్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరో వరుణ్ సందేశ్. అప్పట్లో కాలేజ్ అమ్మాయిలలో వరుణ్ సందేశ్ కున్న క్రేజ్ ఏ వేరు. పక్కింటి కుర్రాడు లా వుండే వరుణ్, సహజమైన శైలిలో తనదైన నటనతో అభిమానుల మన్ననలు పొందాడు అప్పట్లో. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పాత రోజుల్ని గుర్తు తెచ్చుకున్నాడు వరుణ్.
Varun Sandesh, Sukumar
కొత్తబంగారు లోకం సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది అని యాంకర్ అడుగగా, హ్యాపీడేస్ సినిమా ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి ప్రొడ్యూసర్ దిల్ రాజ్ వచ్చారని, అదే సమయంలో వరుణ్ కూడా అక్కడికి అనుకోకుండా జరిగింది అని చెపుతూ, ఎడిటింగ్ రూమ్ లో హ్యాపీడేస్ చిత్రంలోని సన్నివేశాలు చూసిన దిల్ రాజ్ వరుణ్ యాక్టింగ్ కి ఇంప్రెస్ అయ్యి, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తో కథ నరేట్ చేయించాడు అంట. అయితే శ్రీకాంత్ కథ బాగా నచ్చటంతో వరుణ్ తన ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ అయిపోగానే షూటింగ్ స్టార్ట్ చేశారట.’కొత్త బంగారు లోకం’ మూవీ రిలీజ్ అయ్యి అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే.
ఆ తరువాత సంపత్ నంది డైరెక్షన్లో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రం మీద చాలా ఆశలు పెట్టుకుంటాడట వరుణ్. అయితే రిలీజ్ అయిన స్టార్టింగ్ డేస్ మిక్స్డ్ టాక్ రావటంతో ఆశ్చర్య పోయానని, కొన్ని రోజుల తరువాత మళ్లి సినిమాకు మంచి స్పందన వచ్చిందని, ఆ సమయంలో డైరెక్టర్ సుకుమార్ స్వయంగా కాల్ చేసి చాల బాగా చేసావని, నీలో ఇంత హ్యూమర్ ఉందా అని అన్నాడని తెలిపారు. ఆ మధ్య అమెరికా వెళ్లిపోయిన వరుణ్, ప్రస్తుతం మళ్ళీ మూవీస్ లో నటిస్తున్నారు.