నవంబర్ అనేది సినిమాలకి అన్ సీజన్ లాంటిది అంటుంటారు. చాలా సందర్భాల్లో అది నిజమని ప్రూవ్ అయ్యింది. పైగా గతేడాదిలానే ఈసారి కూడా దీపావళి పండుగ కూడా అక్టోబర్ నెలలోనే వచ్చేసింది. దీంతో ఈసారి నవంబర్ నెల మరింత డ్రైగా ఉంటుందేమో అని అంతా భావించారు. కానీ కొంతలో కొంత బెటర్ అనిపించింది అని చెప్పాలి.
విషయంలోకి వెళితే.. 2025 నవంబర్లో మిడ్ రేంజ్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు, చిన్న చితకా సినిమాలు వంటివి మొత్తం కలుపుకుంటే 40 కి టచ్ అయ్యింది లెక్క. ‘మాస్ జాతర’ ‘జటాధర’ ‘ది గర్ల్ ఫ్రెండ్’ ‘ఆర్యన్’ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ‘కాంత’ ‘సంతాన ప్రాప్తిరస్తు’ ‘జిగ్రీస్’ ‘లవ్ OTP’ ‘రాజు వెడ్స్ రాంబాయి’ ‘పాంచ్ మినార్’ ‘ప్రేమంటే’ ’12A రైల్వే కాలనీ’ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ‘రివాల్వర్ రీటా’ వంటి సినిమాలతో పాటు ‘కృష్ణ లీల’ ‘ప్రేమిస్తున్నా’ ‘జనతా బార్’ వంటి చిన్న చితకా సినిమాలు రిలీజ్ అయ్యాయి.

వీటిలో రష్మిక మందన నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. అలాగే ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. మరోపక్క తిరువీర్ హీరోగా నటించిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు కలెక్షన్స్ ను సాధించింది. కానీ నవంబర్ నెలకే పెద్ద సినిమా అనుకున్న రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా.. వసూళ్లు రాబట్టలేక చతికిల పడిపోయింది.

ఇలా 2025 నవంబర్ 2 హిట్లతో పర్వాలేదు అనిపించింది అని చెప్పాలి. రీ రిలీజ్ అయిన నాగార్జున ‘శివ’ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
