మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఫ్యామిలీ సినిమా రాబోతోంది. 2026 సంక్రాంతి బరిలో ఈ సినిమా కూడా నిలబడి తలబడనుంది. సాధారణంగా సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఫ్యామిలీ, కామెడీ ఎలిమెంట్స్ ఉంటే ఈజీగా గట్టెక్కేస్తాయి. దర్శకుడు కిషోర్ తిరుమల సినిమాలు ఈ కోవకే చెందుతాయి. కాబట్టి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై కొద్దో గొప్పో ఆడియన్స్ ఫోకస్ పడింది. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గా ‘బెల్లా బెల్లా’ అనే సాంగ్ గా రిలీజ్ చేశారు.
ఈ లిరికల్ సాంగ్ విషయానికి వస్తే.. ఇది 3 నిమిషాల 37 సెకన్ల నిడివి కలిగి ఉంది. హీరో రవితేజ, హీరోయిన్ ఆషిక రంగనాథ్..ల మధ్య వచ్చే డ్యూయెట్ ఇది అని స్పష్టమవుతుంది. ‘బార్సెలోనా బేబీ.. మార్స్ నుండి మేబీ పుట్టుకొచ్చిందో బీచ్ కి కొట్టుకొచ్చిందో’ అంటూ వచ్చే స్టార్టింగ్ లిరిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ‘బెల్లా బెల్లా ఇజా బెల్లా’ అనే హుక్ లైన్ హమ్ చేసుకునే విధంగా ఉంది. లిరిసిస్ట్ సురేష్ గంగుల… రవితేజ మాస్ ఇమేజ్..ను అలాగే అతని ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని ఈ పాట రాసినట్టు ఉన్నాడు.

లిరిక్స్ అన్నీ క్యాచీగా అనిపించాయి. భీమ్స్ అందించిన ట్యూన్ కూడా వెంటనే ఎక్కేసేలా అనిపిస్తుంది. నకాష్ అజీజ్, రోహిణి హుషారెత్తించే విధంగా ఈ పాటను ఆలపించారు. అయితే ఈ లిరికల్ సాంగ్లో ఇన్ని హైలెట్స్ ఉన్నప్పటికీ.. హీరోయిన్ ఆషిక రంగనాథ్ గ్లామర్ మిగిలిన వాటన్నిటినీ డామినేట్ చేసేసింది అని చెప్పాలి. రవితేజతో కలిసి ఆమె వేసిన స్టెప్పులు వైరల్ కంటెంట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మీరు కూడా ఒకసారి చూస్తూ వినండి
