తెలుగు చిత్ర పరిశ్రమ పుట్టినప్పటి నుంచి అనేకమంది నటీనటులు వెండితెరపైన అద్భుతంగా నటించి అలరించారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే మనల్ని మెప్పిస్తారు. అలా ఎక్కువకాలం హీరోయిన్ గా నటించి కోట్లాది గుండెల్లో స్థానం సంపాదించుకున్న నటీమణులపై ఫోకస్..
1 . అంజలి దేవికృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తారో… సీతాదేవి అంటే అంజలి దేవి గుర్తుకువస్తారు. తెలుగు ప్రేక్షకులు ఆమెను అలాగే ఆరాధిస్తారు. ప్రశాంతమైన కళ్లు, సుకుమారమైన మాటలతో లవకుశలో సీతాదేవిగా నటించి అభిమానులను సంపాదించుకున్నారు. రెండేళ్ల క్రితం మరణించిన ఈమె దాదాపు యాభి ఏళ్ళ పాటు నటిగా వెండితెరపై వెలిగారు.
2 . సావిత్రిజూనియర్ ఆర్టిస్టుగా చిత్ర సీమలో అడుగు పెట్టి నంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగిన నటి సావిత్రి. తన నటనతో దక్షిణాది ప్రజలను మెప్పించి మహానటి అనిపించుకున్నారు. తెలుగు తొలి తరం హీరోలందరితో నటించి విజయాలను సొంతం చేసుకున్న సావిత్రి ముప్పై ఏళ్లపాటు నటిగా కొనసాగారు.
3 . జమునఅల్లరి పిల్ల, పెంకి పిల్లకు ప్రతిరూపం జమున. సత్య భామ పాత్రకు ప్రాణం పోసి శెభాష్ అనిపించుకున్నారు. హుషారుగా డ్యాన్సులు చేసి అలనాటి కుర్రోళ్ళకు కలలరాణిగా పేరుగాంచారు. వందకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన జమున ముప్పై ఏళ్లపాటు తిరుగులేని నటిగా చెలరేగిపోయారు.
4 . శ్రీదేవిసినిమా పరిశ్రమ వేగం పుజుకున్న రోజుల్లో మెరిసిన ఆణిముత్యం శ్రీదేవి. కమర్షియల్ సినిమాలకు ఈమె ఒక బలం అయింది. శ్రీదేవి నటించిన చిత్రాలు కలక్షన్ల వర్షం కురిపించాయి. ఏడేళ్లప్పుడే మేకప్ వేసుకున్న ఈమె పదహారేళ్ళ నుంచి పరుగు అందుకుంది. భాష భేదం లేకుండా దేశంలోనే అనేక అభిమానులను సొంతం చేసుకుంది. ఇరవై ఏళ్ళ పాటు అతిలోక సుందరిగా తళుకులీనింది.
5 . రాధఅప్పట్లో హీరోయిన్స్ హీరోకంటే ఎత్తుల్లో కొంచెం తక్కువగా ఉండేవారు. పొడుగువాళ్ళు హీరోయిన్స్ గా పనికి రారు అనే బార్డర్ ని చెరిపేసి నటి రాధ. టాలీవుడ్ రెండో తరం స్టార్ హీరోలందరితో నటించిన ఈ పొడుగుకాళ్ల సుందరి ఏడేళ్ల పాటు డ్యాన్స్ లతో ఓ ఊపు ఊపింది.
6 . సుహాసినిహీరోయిన్స్ అంటే అందాలతో అదరగొట్టాలనే ఆలోచన వస్తున్న తరుణంలో ఎంట్రీ ఇచ్చి అభినయంతో ఛాన్స్, హిట్స్ అందుకున్న నటి సుహాసిని. సెలెక్టెడ్ పాత్రలను ఎంచుకుంటూ పదేళ్ల పాటు హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈమె, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో ఇరవైఏళ్ళ పాటు మెప్పించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
7 . రాధికకల్మషం లేని నవ్వు, అణువణువునా హుషారు రాధిక సొంతం. సినీ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చిన ఈమె 1978 లో హీరోయిన్ గా అడుగుపెట్టి ఇప్పటివరకు నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూనే ఉన్నారు. బుల్లి తెరలోను నటిస్తూ, సీరియల్స్ నిర్మిస్తూ.. నటనే శ్వాసగా జీవిస్తున్నారు.
8 . విజయశాంతిలేడీ అమితాబ్ గా బిరుదు అందుకున్న నటి విజయశాంతి. చిత్ర పరిశ్రమనుంచి దూరమయ్యేటప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో యాక్షన్ సీన్స్ తో అదరగొట్టింది. అంతకుముందు తన అందచందాలతో అలరించింది. హీరోయిన్స్ కాల వ్యవధి తగ్గిపోతున్న తరుణంలో 20 ఏళ్ల పాటు హీరోయిన్ గా కొనసాగి రికార్డు సృష్టించింది.
9 . సౌందర్యసాధారణంగా హీరోలకు అమ్మాయిల్లో, హీరోయిన్స్ కి అబ్బాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. కానీ చాలా కాలం తర్వాత మహిళల అభిమానాన్ని అందుకున్న నటి సౌందర్య. ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ, విజయాలకు దగ్గరగా ఉంటూ 12 ఏళ్ల పాటు టాలీవుడ్ నంబర్ వన్ కిరీటాన్ని కాపాడుకుంది. ఆమె ప్రమాదంలో చనిపోకుంటే మరో పదేళ్ల పాటు ఆమె హవా నడిచేది.
10 . రమ్య కృష్ణఅందం, అభినయం కలిసిన నటి రమ్య కృష్ణ. హాట్ గా కనిపించి నిద్రలేకుండా చేసింది. హార్ట్ టచ్ చేసి కన్నీరు పెట్టించింది. రెండువైపులా రాణిస్తోంది కాబట్టే చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు క్రేజీ నటిగా దూసుకు పోతోంది. వయసుకు తగ్గ పాత్రలలో కనిపిస్తూ మార్కులు కొట్టేస్తున్న రమ్య కృష్ణకు ఇప్పుడే రిటైర్ మెంట్ టైమ్ చెప్పడం కష్టం.