Posani: బాలకృష్ణ అలాంటి వ్యక్తి అంటున్న పోసాని!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటులలో ఒకరైన పోసాని కృష్ణమురళికి గతంతో పోల్చి చూస్తే సినిమా ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పోసాని ఒక పార్టీకి సపోర్ట్ చేయడం వల్లే ఈ విధంగా జరిగిందని చాలామంది భావిస్తారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ తాను బాలకృష్ణ గారితో కూడా యాక్ట్ చేశానని తెలిపారు. బాలయ్య వ్యక్తిగతంగా ఎవరిపై కామెంట్లు చేయరని పోసాని తెలిపారు. బాలకృష్ణ గారికి కోపం ఉంటుందని అయితే ఆ కోపానికి రీజన్ ఉంటుందని ఆయన అన్నారు.

మంచిగా ఉంటే బాలయ్య మంచిగా ఉంటారని ముఖానికి బాలయ్య తెర వేసుకోరని పోసాని కృష్ణమురళి కామెంట్లు చేశారు. ఛత్రపతి మూవీలో ఒట్టేసి ఒకమాట వేయకుండా ఒక మాట చెప్పనని డైలాగ్ ఉంటుందని రియల్ లైఫ్ లో బాలకృష్ణ కూడా అంతేనని పోసాని కృష్ణమురళి వెల్లడించడం గమనార్హం. సీఎం అయినా సాధారణ వ్యక్తి అయినా బాలయ్య ఒకే విధంగా ఉంటారని ఆయన తెలిపారు. చిరంజీవితో ఖైదీ నంబర్ 150 చేశానని పోసాని చెప్పుకొచ్చారు.

నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన, మనం చేశానని ఆయన తెలిపారు. నాకు నాగచైతన్య అంటే చాలా ఇష్టమని అతను గౌతమబుద్ధుడని పోసాని పేర్కొన్నారు. నాగచైతన్య చాలా హానెస్ట్ అని ప్యూరిఫైడ్ హార్ట్ ఉన్న వ్యక్తి చైతన్య అని పోసాని పేర్కొన్నారు. చైతన్యకు మోసం చేయడం, కృత్తిమంగా ఉండటం తెలియదని పోసాని తెలిపారు. ఆ అబ్బాయి ఏం చెప్పినా నమ్ముతాడని సులువుగా చైతన్యను మోసం చేయొచ్చని పోసాని అన్నారు.

చైతన్య ఉత్తమమైన కుర్రాడు అని పోసాని కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను బాబు బాబు అని పిలుస్తానని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ నన్ను బాగా గౌరవిస్తానని ఆయన తెలిపారు. అల్లు అర్జున్ చాలా పొలైట్ అని ఇప్పుడు కూడా యాక్టింగ్ నేర్చుకుంటూ ఉంటాడని ఎంత పెద్ద స్టార్ అయినా బన్నీ నేర్చుకోవడం మానరని పోసాని పేర్కొన్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus