టాప్ లో విజయ్, ప్రభాస్..మహేష్, పవన్ ప్లేస్ ఎక్కడ?

ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ (ఓ.ఎస్.ఐ.ఎల్) సంస్థ ఒకప్పుడు బాలీవుడ్ నటీనటుల విషయంలో మాత్రమే ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది అనే విషయం పై సర్వే నిర్వహిస్తూ ఉండేది. అయితే కొన్ని నెలలుగా బాలీవుడ్ తో కలిపి సౌత్ సినిమాలను, నటీనటులను పరిగణలోకి తీసుకుని ఇండియా వైడ్ ఈ సర్వే ను నిర్వహిస్తుంది. పాన్ ఇండియా వైడ్ బాగా పాపులర్ అయిన స్టార్స్ (మోస్ట్ పాపులర్ స్టార్స్) ఎవరు అనే లిస్ట్ ను తమ సర్వే ద్వారా ప్రకటిస్తుంటుంది ఈ సంస్థ. ప్రతి సంవత్సరం థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకులు ఎవరు? లేటెస్ట్ గా వారు చూసిన సినిమాలు ఏంటి? అనే విషయాన్ని ఆరా తీసి మరీ వాళ్లకు ఇష్టమైన హీరోల పేర్లు చెప్పమని కోరుతుంది ఈ సంస్థ. వాళ్ళు చెప్పే సమాధానాలను ఆధారం చేసుకుని ఈ లిస్ట్ ను తయారు చేసుకుంటుంది. ఈసారి పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ ఉన్న హీరోలు ఎవరు అనే విషయం పై ఈ సర్వేని నిర్వహించింది. మల్టీ ప్లెక్స్ ల వాతావరణంలో ఈ సర్వే ఎక్కువగా నిర్వహించడం జరుగుతుందని వినికిడి. ఏదేమైనా ఈ సర్వే ప్రకారం ఇండియా వైడ్ పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) విజయ్ : కోలీవుడ్ హీరో విజయ్ ఒక్క పాన్ ఇండియా మూవీలో నటించకపోయినప్పటికీ గత కొన్ని నెలలుగా పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. అందుకే ఇతను నెంబర్ 1 గా నిలిచాడు.

2) ప్రభాస్ : ‘బాహుబలి’ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. ఈసారి రెండో స్థానానికి పడిపోయాడు. ఇతని గత చిత్రం ‘రాధే శ్యామ్’ కలెక్షన్లు విజయ్ ప్లాప్ సినిమాల కలెక్షన్ల కంటే తక్కువగా ఉండటంతో ఇతను రెండో స్థానానికి పడిపోయినట్టు స్పష్టమవుతుంది.

3) ఎన్టీఆర్ : ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడింది. నార్త్ సోదరులు ఎన్టీఆర్ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరైన సినిమా పడితే ఇతను కూడా నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకునే అవకాశం ఉంది కానీ ఇప్పటికైతే నెంబర్ 3 ప్లేస్ లో నిలిచాడు.

4) అల్లు అర్జున్ : మన బన్నీకి 4వ స్థానం దక్కింది. నార్త్ జనాలను ఆకర్షించడంలో బన్నీకి సాటిలేరు ఎవరు అని చెప్పొచ్చు. ‘పుష్ప’ మూవీ ఇతని ఇమేజ్ ను ఇంకా పెంచింది.

5) యష్ : ‘కె.జి.ఎఫ్'(సిరీస్) తో మన రాఖీ బాయ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇతనికి టాప్ 5 ప్లేస్ దక్కింది.

6) అక్షయ్ కుమార్ : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ లిస్ట్ లో టాప్ 6 ప్లేస్ ను సంపాదించుకుని… బాలీవుడ్ పరువు నిలబెట్టాడు అని చెప్పాలి.

7) రాంచరణ్ : ‘ఆర్.ఆర్.ఆర్’ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రాంచరణ్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు కానీ.. అతను ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అతను టాప్ 7 ప్లేస్ ను దక్కించుకున్నాడు.

8) మహేష్ బాబు : ఒక్క పాన్ ఇండియా సినిమాలో నటించకపోయినా మహేష్ కు కూడా పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. అందుకే అతనికి 8వ స్థానం దక్కింది.

9) సూర్య : తమిళ స్టార్ హీరో సూర్య కూడా పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.సరైన హిట్టు పడితే ఇతను కూడా టాప్ 5 లో ఉంటాడు. ఇప్పటికైతే 9వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

10) అజిత్ కుమార్ : తమిళ స్టార్ హీరో అజిత్ కూడా ప్రతి సినిమాతో రూ.100 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొడుతూ పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇతనికి టాప్ 10 ప్లేస్ దక్కింది.

అయితే ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ కు మాత్రం.. ఇప్పటికి ప్లేస్ దక్కలేదు.అలా అని అతనికి పాన్ ఇండియా ఇమేజ్ లేదు అనడం కరెక్ట్ కాదు. ఓవర్సీస్ లో కూడా అతని సినిమాలకు భీభత్సమైన ఓపెనింగ్స్ వస్తాయి. ఇప్పటికైతే అతను వెనుక పడ్డాడు. బహుశా ‘హరి హర వీర మల్లు’ తో ఏమైనా అతని పాన్ ఇండియా ఇమేజ్ పెరుగుతుందేమో చూడాలి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags