Recce: విమర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్న జీ5 వారి ‘రెక్కీ’

‘జీ5’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ క్వాలిటీకి, భారీ తనానికి పెట్టింది పేరు. ‘జీ5’ నుండి వచ్చే కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే.’లూజర్'(సిరీస్) ‘గాలివాన’ ‘బట్టల రామస్వామి బిఓపిక్కు’ ‘బంగార్రాజు’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి సూపర్ హిట్ కంటెంట్ ను ప్రేక్షకులకు అందించి ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ సంస్థ నుండి రాబోయే మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ ‘రెక్కీ’. ఇది ఓ క్రైమ్ థ్రిల్లర్‌ గా రూపొందింది. ఇది జూన్ 17 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

ఇటీవల ట్రైలర్ ను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.1992లో తాడిపత్రి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ హత్య, వాటి చుట్టూ అల్లుకున్న ఉత్కంఠభరితమైన సంఘటనలు నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందింది.శ్రీరామ్, శివ బాలాజీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్ లుగా స్ట్రీమింగ్ కానుంది. ఒక్కో ఎపిసోడ్ 25 నిమిషాల పాటు ఉంటుంది. ధన్య బాలకృష్ణ,రేఖ,ఆడుకలం నరేన్,శరణ్య ప్రదీప్ తదితరులు ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషించారు.

తాజాగా ‘రెక్కీ’ సిరీస్ ను పాత్రికేయుల కొరకు స్పెషల్ గా ప్రీమియర్స్ వేశారు మేకర్స్. ఈ సిరీస్ ను వీక్షించిన విశ్లేషకులు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. డైరెక్షన్, విజువల్స్, నేపధ్య సంగీతం, కాస్ట్ అండ్ క్రూ అంతా చక్కగా కుదిరింది అని.. కచ్చితంగా ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది అని వారు చెబుతున్నారు. విమర్శకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో దర్శక నిర్మాతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రోజు అర్ధరాత్రి నుంచి అంటే 12 గంటల నుండి జీ5 లో ప్రేక్షకులు వీక్షించవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags