Ram Charan, Akhira: జనసేన కటౌట్ లో చరణ్-అఖిరా కిక్!

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం రోజురోజుకీ మరింత శక్తివంతమవుతుండగా, ఆ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే మరో ప్రత్యేక సందర్భం పిఠాపురంలో చోటు చేసుకుంది. జనసేన ఉపముఖ్యమంత్రి కార్యాలయం వెలుపల ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ కటౌట్‌లో పవన్ కళ్యాణ్‌ తో (Pawan Kalyan) పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) , ఫ్యూచర్ పవర్ స్టార్ అకీరా నందన్‌ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మొత్తం ఆరు అడుగుల ఎత్తు కలిగిన ఈ ఫ్లెక్సీ ప్రత్యేకత ఏమిటంటే, పవన్ కళ్యాణ్ కుటుంబంలోని కీలక సభ్యులను ఒకే బోర్డులో చూపించడం.

Ram Charan, Akhira

ఒకవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) , మరోవైపు తన తండ్రి లెగసీని కొనసాగించే శక్తి కలిగిన యువకుడు అకీరా నందన్ ఈ కటౌట్‌లో ప్రత్యేకంగా నిలిచారు. ఇది అభిమానుల్లో కొత్త రకమైన ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఆ ఫ్లెక్సీ ముందు జనసైనికులు ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. అకీరా నందన్, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంటున్నాడు.

హీరోగా ఎంట్రీ ఇవ్వకపోయినా, తన చరిష్మాతో యువతలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. గతంలో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాలో అకీరా ప్రత్యేక పాత్ర ఉంటుందనే వార్తలు వచ్చాయి. అయితే, ఆ గుసగుసలు ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించబడలేదు. ఇక చరణ్, అకీరా కటౌట్‌లో కలిసి కనిపించడం అభిమానుల్లో చర్చకు దారి తీసింది.

పవన్ కల్యాణ్‌ను మధ్యలో ఉంచి, ఆయనకు ఒకవైపు రక్త సంబంధం ఉన్న అకీరా, మరోవైపు గ్లోబల్ స్టార్ చరణ్‌ను ఉంచడం అనేది అభిమానులకు కొత్త ఎమోషన్‌ను ఇచ్చింది. ఫ్యాన్స్ సైతం భవిష్యత్తులో చరణ్‌ అకీరా కలిసి ఒకే చిత్రంలో నటించాలనే తమ కోరికను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఈ కటౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాగవంశీ మాటకు.. బాలీవుడ్ పెద్దోళ్ళ తూటాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus