ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపించనున్న టాప్ హీరోయిన్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ‘యూ.వీ.క్రియేషన్స్’ బ్యానర్ వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019 ఆగష్టు 15 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒక వైపు ‘సాహో’ చిత్రం చేస్తూనే మరో వైపు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో తన 20 వ చిత్రంలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది.

రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త బయటకొచ్చింది. ‘ప్రభాస్ 20’ 1960 కాలం నాటి ప్రేమకథగా తెరకెక్కుతుందట. తాజాగా ఈ చిత్ర అప్డేట్ కోసం ట్విట్టర్లో రచ్చ చేసారు ప్రభాస్ అభిమానులు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ స్పందించి శాంతి పరిచే ప్రయత్నం చేసాడు. “ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ .. దయచేసి తొందరపడకండి. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తాము” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ఈ చిత్రంలో శ్రీమంతుడు పాత్రలో కనిపించబోతున్నాడట . అంతేకాదు పాతకాలం నాటి కార్లను ఇష్టపడే వ్యక్తి పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మరో హీరోయిన్ కూడా ఉండబోతుందని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్రని అనుష్క పోషించబోతున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus