‘ప్రభాస్ 20’ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్.. కానీ..?

ఏ ముహూర్తాన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడో కానీ.. అప్పటి నుండీ ప్రభాస్ అభిమానులు మాత్రం అప్డేట్స్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది. ‘మిర్చి’ 2013 లో విడుదలైతే.. 2015లో ‘బాహుబలి1’ విడుదలైంది. ఇక ‘బాహుబలి 2’ 2017 లో వచ్చింది మళ్ళీ ‘సాహో’ 2019 లో విడుదలయ్యింది. ఇలా రెండేళ్ళకి ఒక సినిమా అన్నట్టు ఉంది. అయితే ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ .. కచ్చితంగా తన నెక్స్ట్ సినిమాని ఫాస్ట్ గా ఫినిష్ చేస్తాను అని చెప్పాడు. కానీ తన తరువాతి సినిమా అప్డేట్స్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు.

సంక్రాంతికి మొక్కుబడిగా సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అంటూ ఓ అప్డేట్ ఇచ్చారు. కానీ షూటింగ్ జరుగుతుందా లేదా అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలీదు. ఇక ఈ చిత్రానికి ‘ఓ డియర్’ ‘రాధేశ్యామ్’ అనే టైటిల్స్ రిజిస్టర్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇందులో ‘రాధేశ్యామ్’ ఫైనల్ చేసారని కొందరంటున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని.. వచ్చే ఏడాది అంటే 2021 సమ్మర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు కొంతమంది చెబుతుంటే.. మరికొంత మంది ఈ ఏడాది దసరాకే రిలీజ్ అంటున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చెయ్యాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. ఇప్పటీకే సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ నిర్మాతల పై ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఉగాది వరకూ వెయిట్ చేస్తారా..!

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus