Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

ఒక హీరో ఒకే నిర్మాతతో దగ్గర దగ్గరలో సినిమాలు చేస్తేనే ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉన్న రోజులివి. అందుకే హీరో – నిర్మాత కాంబో రిపీట్‌ కాంబో ఫిక్స్‌ అనే మాట తక్కువగా వింటూ ఉంటాం. అలాంటి ఈ రోజుల్లో ఓ హీరో ఒకే నిర్మాతతో మూడు సినిమాలు చేస్తా అని ఒప్పుకున్నారు. ఈ మేరకు అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది. దీంతో ఆశ్చర్యపోవడం అభిమానులు, ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాల వంతు అయింది. ఎందుకు, ఎలా అనే చర్చ జరిగింది. ఆ హీరో ప్రభాస్‌ అయితే, ఆ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌.

Prabhas

కొన్ని నెలల క్రితం మా బ్యానర్‌లో ప్రభాస్‌ మూడు సినిమాలు చేస్తాడు అని హోంబలే ఫిల్మ్స్‌ ప్రకటించింది. ఇప్పుడు ఈ విషయంలో ప్రభాస్‌ క్లారిటీ ఇచ్చాడు. హోంబలే విజయ్‌ కిరంగదూర్‌ తన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని బాగా చూసుకుంటాడు. పెద్దగా సర్కిల్ మెయింటైన్ చేయడు. ఇప్పటికీ చిన్ననాటి స్నేహితులను కలుస్తూ, వారితో టైమ్‌ స్పెండ్‌ చేస్తాడు. ఈ గుణాలు బాగా నచ్చాయి. అంతేకాదు సినిమాల విషయంలో మా ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. అందుకే ఒకేసారి 3 సినిమాలకు అంగీకరించాను అని ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు.

‘సలార్’ సినిమా చేస్తున్నప్పుడే నిర్మాత విజయ్ ఇంట్లో తాను ఓ కుటుంబ సభ్యుడిలా మారిపోయానని, అలాంటి వాళ్లతో దీర్ఘకాల అనుబంధం బాగుంటుంది అనిపించింది అని కూడా చెప్పాడు ప్రభాస్‌. ‘సలార్‌ 2’ సినిమాతో ఆ మూడు సినిమా కాంట్రాక్ట్‌ మొదలవుతుంది అని సమాచారం. ఇక మన హీరోలెవ్వరూ ఇలా ఒకే బ్యానర్‌కు కమిట్ అవ్వరు. ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి పరిస్థితి చూడలేదు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ గతంలో ఇలా చేశాడు. ఇప్పుడు ప్రభాస్‌ చేస్తున్నాడు.

బాలీవుడ్‌లో టీసిరీస్‌తో కూడా ప్రభాస్‌ ఇలాంటి డీల్‌ పెట్టుకున్నాడని టాక్‌. టి సిరీస్‌ నిర్మాణ సంస్థకు ‘ఆదిపురుష్‌’ సినిమా చేసినప్పుడు ‘స్పిరిట్‌’ సినిమా ఫిక్స్‌ అయ్యాడు. అక్కడ ఇంకో సినిమా కూడా ఉంది అని సమాచారం.

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus