అవును.. సెప్టెంబర్ 5కి డిమాండ్ పెరిగింది. ఇప్పటివరకు ఆ డేట్ కి ఒక్క తేజ సజ్జ ‘మిరాయ్’ మాత్రమే రిలీజ్ కాబోతుంది అని మేకర్స్ అనౌన్స్ చేశారు. మరో సినిమా ఇప్పటివరకు రేసులో లేదు. కానీ నిన్న ఒక్కరోజే ఆ డేట్ కి మరికొన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయి. ముందుగా తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్’ రిలీజ్ కానుంది. ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ నుండి రాబోతున్న సినిమా ఇది.
మంచు మనోజ్ కూడా ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సోలో రిలీజ్ డేట్ కావాలనే ఉద్దేశంతో ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా సెప్టెంబర్ 5ని ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమాకి ఊహించని విధంగా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుష్క, దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రూపొందిన ‘ఘాటి’ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వాస్తవానికి జూలై 11నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ వి.ఎఫ్.ఎక్స్ పనులు పెండింగ్ ఉండటంతో సెప్టెంబర్ 5కి వాయిదా వేశారు. దీంతో పాటు ‘గీతా ఆర్ట్స్’ సంస్థలో రష్మిక ప్రధాన పాత్రలో రూపొందిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సైతం సెప్టెంబర్ 5కే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సెప్టెంబర్ 5నే రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్.
రష్మిక సూపర్ ఫామ్లో ఉంది. కాబట్టి.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ కి కనుక పాజిటివ్ టాక్ వస్తే ‘మిరాయ్’ కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘మదరాసి’ కూడా అదే డేట్ కి రిలీజ్ కానుంది. అలాగే విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ సైతం సెప్టెంబర్ 5నే రిలీజ్ కానున్నట్టు టాక్ నడుస్తుంది. విజయ్ ఆంటోని సినిమాలు ఈ మధ్య ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్లిపోతున్నాయో.. ఎవరికీ అర్థం కాని పరిస్థితి. సో ‘మిరాయ్’ కి ఈ సినిమాతో ఇబ్బంది లేనట్టే..!