Prabhas, Kantara: ప్రభాస్ ‘కాంతార’ సినిమాని ఎన్నిసార్లు చూశాడో తెలుసా!

గతకొద్ది రోజులుగా ఎవరినోట విన్నా ‘కాంతార’ సినిమా గురించే.. ఎక్కడ ఇద్దరు, ముగ్గురు మాట్లాడుకున్నా ’‘కాంతార’ మూవీ చూశావా?.. భలే ఉందంటగా’’.. అనే టాక్ నడుస్తోంది.. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ఇంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.. భాషతో సంబంధం లేకుండా కాన్సెప్ట్ కీ, కల్చర్ కీ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్.. దీంతో మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ దుమ్ముదులుుపుతోంది..

నిర్మాతతో పాటు సినిమా ఆడుతుందని ముందే గ్రహించి తెలుగులో రిలీజ్ చేసిన అగ్రనిర్మాత అల్లు అరవింద్ తో పాటు మిగతా చోట్ల కొన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంతా లాభాల బాట పట్టారు.. ఇక నార్త్ లోనూ ‘కాంతార’ కలెక్షన్లు కుమ్మేస్తోంది.. సినిమా చూసిన పలు రంగాలకు చెందిన ప్రముఖులు, ముఖ్యంగా వివిధ భాషల సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ‘కాంతార’ ఓ కళాఖండం అంటూ.. రిషబ్ శెట్టిని ఓ రేంజ్ లో పొగుడుతున్నారు.. దీంతో ఆయనకి మరిన్ని క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి..

అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వూలో ‘కాంతార’ సినిమాకు సినీ ప్రముఖుల నుండి వస్తున్న స్పందన, ఫోన్ కాల్స్ గురించి యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. మన రెబల్ స్టార్ ప్రభాస్ నుండి మాత్రం బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అందుకున్నానని చెప్పాడు. డార్లింగ్ ఇప్పటికే ‘కాంతార’ మూవీని రెండు సార్లు చూశాడట.. ముచ్చటగా మూడోసారి కూడా చూడడానికి ఆయన రెడీగా ఉన్నారని తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు రిషబ్ శెట్టి..

అలాగే ‘కాంతార’ చిత్రంలో అంతరించిపోతున్న తమ ప్రాచీన కళలను, వాటిని పెంచిపోషిస్తున్న కళాకారులను గుర్తించాలని.. అరవై సంవత్సరాలు పైబడిన దైవ నర్తకులకు.. వారి ఖర్చుల నిమిత్తం నెలకు రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ‘కాంతార’ సినిమాతో తమ సంస్కృతీ, సాంప్రదాయాలను అందరికీ తెలిసేలా చెయ్యడమే కాక.. కళనే నమ్ముకున్న తమకు ప్రభుత్వం సాయం చేయడానికి కారణమైన రిషబ్ శెట్టికి కళాకారులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus