లండన్ ట్రిప్ లో అనుష్క పక్కన నిల్చోవడానికి కూడా ఆలోచించిన ప్రభాస్

ప్రభాస్-అనుష్క ఈ రెండు పేర్లు పక్కపక్కన ఉంటేనే అభిమానులు తెగ ఖుషీ అయిపోతారు. కానీ.. మొన్న లండన్ లో జరిగిన బాహుబలి మ్యూజికల్ ప్రీమియర్ లో మాత్రం ప్రభాస్ & అనుష్క కనీసం ఒకరి పక్కన ఒకరు నిల్చోకపోవడం వాళ్ళ అభిమానుల్ని నిరాశపరిచింది. “బాహుబలి 2” ప్రమోషన్స్ టైమ్స్ లో ప్రభాస్ & అనుష్కల జంట వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంది. వాళ్ళిద్దరూ ప్రెస్ మీట్స్ లో ఒకర్నొకరు చూసుకొనే విధానం ట్రెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే.. రేపు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో రాజమౌళి & టీం లండన్ లోనే ప్రభాస్ & అనుష్క జంటగా ఈ వేడుకలను ఎంజాయ్ చేయనున్నారని పలు బాలీవుడ్ మీడియా వర్గాలు వార్తలు ప్రచురించడం ప్రభాస్ కు నచ్చలేదట. మళ్ళీ ఈ లండన్ వేడుకలో అనుష్కతో కలిసి ఉన్న ఫోటోలు బయటకి వస్తే ఎక్కడ ఆ వార్తలు నిజమవుతాయో అని భయపడి.. కనీసం అనుష్క పక్కన కూడా నిలబడలేదట. మరీ గాసిప్పులకు భయపడి ప్రభాస్ ఈ రేంజ్ లో గ్యాప్ మైంటైన్ చేయాలా అని వాళ్ళ అభిమానులు బాధపడుతున్నారు.

1

2

3

4

5

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus