ప్రభాస్ కోసం అంత ఖర్చు చేస్తున్నారా..?

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ అన్నీ కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథలనే ఎన్నుకుంటున్నాడు. నిజానికి ‘సాహో’ సినిమాను వంద కోట్లలో తీయాలనుకున్నారు కానీ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోవడంతో ‘సాహో’ బడ్జెట్ కూడా పెంచేశారు. చివరికి సినిమా పూర్తి కావడానికి మూడొందల కోట్లు ఖర్చు చేశారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ కొత్త సినిమా ‘రాధేశ్యామ్’కు బడ్జెట్ నియంత్రణ పాటిస్తున్నారు.

కానీ దీని తరువాత ప్రభాస్ చేయబోయే సినిమాల విషయంలో మాత్రం బడ్జెట్ కి సంబంధించి పరిమితులు పెట్టుకోవడం లేదు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ప్రభాస్ చేయబోయే ‘ఆదిపురుష్’ సినిమాకి ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారు. ఇదే గనుక నిజమైతే ఇండియాలో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా అవుతుంది. ఇప్పుడు ఈ రికార్డ్ ని కూడా ప్రభాసే బద్దలు కొట్టబోతున్నట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మించనున్నారు.

అయితే ఈ సినిమా కోసం రూ.600 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తాజాగా ఒక వీడియో ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత అశ్వనీదత్ వెల్లడించారు. ఆయన స్వయంగా చెప్పారు కాబట్టి ఇదే అఫీషియల్ బడ్జెట్ అవుతుంది. ఒక ఇండియా సినిమా కోసం ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. అంత ఖర్చు చేసి ఎలాంటి సినిమా తీయబోతున్నారనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ముందుగా ‘ఆదిపురుష్’ పూర్తి చేసి తమ సినిమా సెట్స్ పైకి వస్తారని అశ్వనీదత్ క్లారిటీ ఇచ్చారు. తమ సినిమా పూర్తి కావడానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని స్పష్టం చేశారు అశ్వనీదత్.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus