ప్రభాస్, రాధాకృష్ణ మూవీ సెట్స్ మీదకు వెళ్ళేది ఎప్పుడంటే ?

బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లేటెస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో ప్లాన్ చేశారు. అందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రం తర్వాత సినిమాకి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపి కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్లో నటించడానికి ఓకే చెప్పారు. కృష్ణం రాజు నిర్మించనున్న ఆ సినిమాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నారు.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీలో హీరోయిన్ గా డీజే బ్యూటీ పూజా హెగ్డే ఫిక్స్ అయినట్లు తెలిసింది. “దందా” అనే పేరు పరిశీలిస్తున్న ఈ చిత్రం జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. అప్పటి లోపున ప్రభాస్ సాహో కి సంబంధించిన మెయిన్ పార్ట్ (షూటింగ్) కంప్లీట్ చేయనున్నారు. అనంతరం ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటారు. గతంలో ప్రభాస్‌ తో కృష్ణంరాజు “బిల్లా” నిర్మించారు. ఆ తర్వాత “భక్త కన్నప్ప” అనే సినిమాను నిర్మించాలని అనుకున్నారు. కానీ ఆ కథని పక్కన పెట్టి ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధమయ్యారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus