నా స్థలాన్ని వదులుకునేది లేదు : ప్రభాస్

తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ హౌస్ ను గత సోమవారం డిసెంబర్ 17 న శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అసలు విషయాన్ని పరిశీలిస్తే హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో రాయదుర్గం పరిసరాలకు చెందిన సర్వేనంబర్ 46లోని స్థలాలన్నీ ప్రభుత్వ స్థలాలుగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు తాజాగా తీర్పు నివ్వడం జరిగింది.ఈ ప్రదేశంలో మొత్తం 84.30 ఎకరాల వరకు ఉన్న స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా సుప్రీంకోర్టు గుర్తించి దీని పై ఈ చర్య తీసుకుంది. ప్రభాస్ కు ఈ ప్రదేశంలో దాదాపు 2200 గజాల స్థలం వరకూ ఉండడంతో గెస్ట్ హౌస్ ను నిర్మించుకున్నారట . అయితే ప్రభుత్వ స్థలాల్లో ప్రభాస్ స్థలం కూడా ఇందులో కలిగి ఉండడంతో సీజ్ చేసినట్టు తెలుస్తుంది.

అయితే ఈ మేరకు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ స్థలానికి సంబంచిన పత్రాలు తన దగ్గర ఉన్నాయని.. ఈ స్థలాన్ని ప్రభాస్ కు కొందరు కార్పొరేట్ వ్యక్తులు అమ్మారని…. కనీసం నోటీసులు కూడా జరీ చేయకుండా ఎలా సీజ్ చేస్తారని…. ఏదేమైనా… ఈ స్థలాన్ని వదులుకునేది లేదని ప్రభాస్ పోరాడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయం పై హైకోర్టు ఏ విధమైన తీర్పునిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus