Prabhas: ప్రభాస్ బ్రహ్మరక్షసుడా.. వర్మ ప్లాన్ ఏంటీ?

Ad not loaded.

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ  (Prashanth Varma) తన కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘హనుమాన్’(Hanu Man)  మూవీకి మంచి స్పందన రావడంతో, తన సొంత సినిమాటిక్ యూనివర్స్‌ను తీర్చిదిద్దుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఈ యూనివర్స్‌లో వివిధ సినిమాలు లైన్‌లో పెట్టి ముందుకు వెళ్తున్నాడు. రీసెంట్‌గా ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు, రిషబ్ శెట్టి (Rishab Shetty) హనుమంతుడి పాత్రలో నటిస్తున్నాడు.ఇదే సమయంలో ప్రశాంత్ వర్మ మరో కొత్త ప్రాజెక్ట్‌ కథను ప్రభాస్‌కు (Prabhas)   నేరేట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

Prabhas

ఈ కథ ‘బ్రహ్మరాక్షస’ అనే కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంటుందట. ఈ కథను ప్రభాస్ నేరేట్ చేయడం జరిగింది కానీ, ఇంకా డార్లింగ్ నుంచి పాజిటివ్ సమాధానం రాలేదని సమాచారం. ‘జై హనుమాన్’ సినిమా హిట్ అయితే, ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్ట్‌కి సై అని చెప్పే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే కథతో ప్రశాంత్ వర్మ గతంలో రణవీర్ సింగ్‌తో  (Ranveer Singh)  సినిమా చేయాలని ప్రణాళిక వేశాడు. అయితే ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది.

ఇప్పుడు అదే కథని ప్రభాస్‌కి (Prabhas) నేరేట్ చేసినట్లు టాక్ ఉంది. ‘జై హనుమాన్’ సినిమా విజయం సాధిస్తే ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేసుకోవాలని భావిస్తున్నారట. కానీ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేతిలో ఉన్న ‘హనుమాన్’ యూనివర్స్‌కి చెందిన రెండు సినిమాలు పూర్తవ్వడానికి కనీసం రెండేళ్లు పడుతుందట.

ఆ తరువాత ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ అవుతాయని అనుకుంటున్నారు. మరి ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చేస్తాడా లేదా అనేది ‘జై హనుమాన్’ మూవీ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి ఇంతలోనే సుదీర్ఘ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్ ప్రభాస్ అభిమానులకు కొత్తగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రశాంత్ వర్మ ప్రతీసారి సరికొత్త కథలు అందిస్తూ ప్రేక్షకులను మెప్పించేలా ప్లాన్ చేస్తున్నాడు.

 ‘గేమ్ ఛేంజర్’ లో ఆ ఫైట్ మెగా ఫ్యాన్స్ కి గూజ్ బంప్స్ తెప్పిస్తుందట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus