ప్రభాస్ కు మరో అరుదైన గౌరవం..!

‘బాహుబలి’ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఈఏడాది విడుదలైన ‘సాహో’ చిత్రంతో తాను ‘పాన్ ఇండియా స్టార్’ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. బాలీవుడ్ లో ఈ చిత్రం 125కోట్ల పైనే కలెక్షన్లను రాబట్టి హిట్ గా నిలిచింది. ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో తన 20 వ చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. ఇది పక్కన పెడితే.. ఇప్పుడు ప్రభాస్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘ఏషియన్‌ సె**యస్ట్‌ మేల్స్‌ 2019’ లిస్ట్ లో ప్రభాస్ చోటు సంపాదించుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. ‘బ్రిటిష్‌ ఈస్టర్న్‌’ అనే సంస్థ ఆన్‌లైన్‌ పోల్‌ ను ఆధారం చేసుకుని.. బుధవారం లండన్‌లో టాప్ లో వచ్చిన సెలబ్రిటీల లిస్ట్ ను విడుదల చేసింది. బ్రిటన్ కు చెందిన ‘ఈస్టర్న్‌’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల ఓట్లతో పాటు.. సోషల్ మీడియాలో వేడి పెంచుతూ.. ఈ ఏడాది ఎక్కువ ప్రభావం చూపే హీరోలు అనే లిస్ట్ ను తయారు చేసింది. ఈ లిస్ట్ లో టాప్ 10 ప్లేస్ ను దక్కించుకున్నాడు ప్రభాస్. సౌత్ లో మరే హీరోకి ఈ లిస్ట్ లో ప్లేస్ దక్కలేదు. కేవలం ప్రభాస్ కు మాత్రమే ఆ గౌరవం దక్కింది. ఇక ఈ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకున్నాడు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus