Prabhas: ‘స్పిరిట్’.. అసలు నిజం తేలిసిపోయిందా?

ప్రభాస్ పుట్టినరోజుకు ‘స్పిరిట్’ టీమ్ ఇచ్చిన వాయిస్ గ్లింప్స్ పెద్ద సంచలనమే అయ్యింది. ప్రకాష్ రాజ్ వాయిస్‌తో మొదలై, “నాకో బ్యాడ్ హ్యాబిట్ ఉంది” అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్‌కు ఫ్యాన్స్ ఊగిపోయారు. అయితే, ఆ వెంటనే ఆ వాయిస్ ప్రభాస్‌ది కాదని, ఏఐ (AI) సాయంతో క్రియేట్ చేశారని గట్టిగా ప్రచారం జరిగింది.

Prabhas

అప్పుడు ఆ వార్తను కొందరు కొట్టిపారేశారు. చిన్న డైలాగ్ కోసం ఏఐ వాడాల్సిన అవసరం సందీప్ వంగాకు ఏముందని వాదించారు. కానీ, తాజాగా విడుదలైన ‘బాహుబలి: ది ఎపిక్’ రీ రిలీజ్ ఇంటర్వ్యూ చూశాక, ఆ ఏఐ రూమర్ నిజమేనన్న వాదనకు బలం చేకూరింది.

ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ వాయిస్ చాలా బొంగురుగా, జలుబు చేసినట్లుగా ఉంది. ‘స్పిరిట్’ గ్లింప్స్‌లో వినిపించిన పవర్, ఆ బేస్.. ఈ ఇంటర్వ్యూ వాయిస్‌కు ఏమాత్రం సింక్ అవ్వడం లేదు. ఇది చూసిన నెటిజన్లు ఇప్పుడు రెండుగా విడిపోయారు.

ఒక వర్గం, “చూశారా.. బర్త్‌డే టైమ్‌కు ప్రభాస్ వాయిస్ ఇలా డల్‌గా ఉంది. అందుకే సందీప్ ఏఐ వాడాడు. ‘స్పిరిట్’ గ్లింప్స్‌లోని వాయిస్ 100% ఏఐ జెనరేటెడ్” అని ఫిక్స్ అయిపోయారు. అయితే, మరో వర్గం దీన్ని ఖండిస్తోంది. “గ్లింప్స్ రికార్డింగ్ ఎప్పుడో కొన్ని నెలల క్రితం జరిగి ఉంటుంది. అప్పుడు ప్రభాస్ వాయిస్ పర్‌ఫెక్ట్‌గా ఉంది.

‘బాహుబలి’ ఇంటర్వ్యూ ఈ మధ్య జలుబు చేసినప్పుడు రికార్డ్ చేశారు. రెండింటికీ లింక్ పెట్టడం కరెక్ట్ కాదు” అని వాదిస్తున్నారు.

ఏది ఏమైనా, బాహుబలిఇంటర్వ్యూ, ‘స్పిరిట్వాయిస్‌పై కొత్త రచ్చకు దారి తీసింది. ఆ గ్లింప్స్‌లో విన్నది ఒరిజినల్ ప్రభాసా? లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? అనేది తెలియాలంటే సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus