ప్లాప్ సినిమాతోనే మరో రికార్డ్ సృష్టించిన ప్రభాస్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తున్నాడు. గోపీచంద్ తో ‘జిల్’ వంటి యావరేజ్ సినిమాని తెరకెక్కించిన రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘గోపికృష్ణ మూవీస్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో దీపికా పడుకొనె ను హీరోయిన్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. గతేడాది ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం ప్లాప్ గా మిగిలిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫ్లాప్ సినిమాతోనే.. ప్రభాస్ ఆమీర్ ఖాన్ రికార్డులను బ్రేక్ చెయ్యడం విశేషం. వివరాల్లోకి వెళితే.. లాక్ డౌన్ తరువాత జపాన్ లో థియేటర్లు తెరుచుకోవడంతో ‘సాహో’ చిత్రాన్ని అక్కడ విడుదల చేశారు. నిజానికి జనవరిలోనే ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేసారు.. కానీ ఆ టైంకి వైరస్ మహమ్మారి ఎంట్రీ ఇవ్వడంతో థియేటర్లు మూతపడ్డాయి.

దాంతో ఇప్పుడు మళ్ళీ థియేటర్లు తెరుచుకున్నాక.. ‘సాహో’ చిత్రాన్ని అక్కడ మరోసారి ప్రదర్శించారు. మొదటి రోజే ఈ చిత్రం అక్కడ అదిరిపోయే ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇండియన్ సినిమాల్లోనే ఈ చిత్రం అక్కడ రికార్డ్ ఓపెనింగ్స్ ను రాబట్టడం విశేషం. ఏకంగా ఆమిర్ ఖాన్ ‘దంగల్’ చిత్రం ఓపెనింగ్స్ నే అధిగమించింది ప్రభాస్ చిత్రం.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus