Prabhas, Allu Arjun: పుష్ప రిజల్ట్ పై ప్రభాస్ కామెంట్!

రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. యు.వి క్రియేషన్స్ గోపికృష్ణ బ్యానర్ లో సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ప్రేమకు విధికి జరిగే యుద్ధమే రాధేశ్యామ్ సినిమా అని ఇప్పటికే విడుదల చేసిన 2 ట్రైలర్స్ ద్వారా ఒక క్లారిటీ ఇచ్చారు. ట్రైలర్స్ పాజిటివ్ రియాక్షన్స్ ను అందుకున్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంటుందని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ లో కూడా ప్రభాస్ చాలా బిజీ అయిపోయాడు. ఇటీవల ముంబైలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రభాస్ పలు ఆసక్తికరమైన విషయాల పై తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా ఇటీవల పుష్ప హిందీలో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం పై బాలీవుడ్ మీడియా ప్రశ్నించగా ప్రభాస్ చాలా సున్నితంగా సమాధానమిచ్చాడు. నిజంగా సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ తగ్గట్టుగా సక్సెస్ అవ్వడం ఆనందించాల్సిన విషయం.

తెలుగు సినిమాలు దేశాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకునే రోజులు వస్తున్నాయి. కేజిఎఫ్ తర్వాత పుష్ప మంచి విజయాన్ని అందుకోవడం ఆనందించాల్సిన విషయం. ఇక రానున్న రోజుల్లో మరిన్ని సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్నాయి అని చెప్పవచ్చు అంటూ ప్రభాస్ తన వివరణ ఇచ్చాడు. ఇక రాధేశ్యామ్ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది అని ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ అని వివరణ ఇచ్చాడు.

రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ సినిమాలు చేస్తూనే మరోవైపు ఇలాంటి ప్రయోగాత్మకమైన ప్రేమకథలు కూడా చేస్తాను అని ఎప్పుడూ ఒకే తరహాలో సినిమాలు చేస్తే అభిమానులు కూడా బోర్ గా ఫీలవుతారు అని చెప్పాడు. వీలైనంత వరకు అభిమానులకు బోర్ కొట్టకుండా సినిమాలు చేయడమే తన బాధ్యత అని ప్రభాస్ తెలియజేశాడు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus