యాక్షన్ కి దూరంగా రెబల్ స్టార్!

టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్ మొదటి నుండి కూడా యాక్షన్ ప్రధానమైన సినిమాలనే చేస్తూ వచ్చాడు. మధ్యలో ఒకట్రెండు లవ్ స్టోరీస్ చేసినా.. అందులో కూడా యాక్షన్ సీన్స్ ఉండేలా చూసుకున్నాడు. అతడికి మాస్ ఇమేజ్ పెరగడంతో యాక్షన్ మోతాదు ఎక్కువ ఉన్న చిత్రాల్లోనే నటిస్తున్నాడు. అభిమానులు కూడా ప్రభాస్ ను అలాంటి కథల్లోనే చూడాలనుకుంటున్నారు. ‘సాహో’ పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినప్పటికీ కథాకథనాల లోపాల వలన సినిమా వర్కవుట్ కాలేదు. కానీ కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఇదిలా ఉండగా.. ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమాని చూస్తుంటే పూర్తి క్లాస్ గా కనిపిస్తోంది. ముందు నుండి కూడా ఇది పూర్తి స్థాయి ప్రేమకథ అనే సంకేతాలే ఇస్తుంది చిత్రబృందం. ఈ క్రమంలో ఈ సినిమాలో యాక్షన్ సంగతేంటనే సందేహాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి. అయితే వారికి ఈ సినిమా విషయంలో మరింత స్పష్టత ఇచ్చేశాడు ప్రభాస్. ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ లో భాగంగా ప్రభాస్ ఇటలీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ సినిమా గురించి మాట్లాడారు.

ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ అని చెప్పాడు. సినిమాలో ఒక్క యాక్షన్ ఎపిసోడ్ మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ ఒక్క ఎపిసోడ్ తప్పిస్తే సినిమా మొత్తం కూడా లవ్ స్టోరీ చుట్టూనే తిరుగుతుందని వెల్లడించారు. దీన్ని బట్టి సినిమాలో ఎమోషన్స్ తప్ప యాక్షన్ సీన్స్ కి పెద్దగా ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ముందుగానే చెప్పేసి ఫ్యాన్స్ ని ప్రిపేర్ చేస్తున్నాడు ప్రభాస్. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ ని కూడా లవ్ స్టోరీతోనే నింపేశాడు. సినిమా టీజర్, ట్రైలర్ వచ్చిన తరువాత సినిమా జోనర్ విషయంలో మరింత క్లారిటీ వస్తుంది. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus