అక్కడే ప్రభాస్ ఫ్యాన్స్.. నిర్మాతల పై మండిపడుతున్నారట..!

లాక్ డౌన్ కు ముందే ‘ప్రభాస్ 20’ చిత్రం సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తయ్యింది అంటూ దర్శకుడు రాధా కృష్ణకుమార్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. త్వరలోనే ఫస్ట్ లుక్ వస్తుంది అని కూడా చెప్పాడు. కానీ ఆ ట్వీట్ పెట్టి 3 నెలలు కావస్తున్నా.. ఇంకా ఫస్ట్ లుక్ ను కానీ.. టైటిల్ ను కానీ విడుదల చెయ్యలేదు.. ‘ప్రభాస్ 20’ నిర్మాతలు. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ వీరి పై మండిపడుతున్నారు. ‘ప్రభాస్ 20′ కంటే కూడా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ నటించబోయే చిత్రం ఫస్ట్ లుక్ ముందుగా విడుదలైపోతుందేమో’ అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.

ఒకానొక దశలో ‘#BanUVCreations’ అంటూ ఇండియా వైడ్ ట్రెండ్ చేశారు. అంతేకాదు ‘ప్రభాస్ తదుపరి సినిమాలు.. ‘యూవీ’ వారితో చెయ్యొద్దు’ అంటూ ప్రభాస్ కు రిక్వెస్ట్ లు కూడా పెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు ఫ్యాన్స్. 2 షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యింది. ఒక 30 సెకండ్ల టీజర్ ను విడుదల చేస్తే సినిమా పై హైప్ పెరుగుతుంది కదా.! ‘బాహుబలి2’ ఫినిష్ అయిన వెంటనే.. ‘సాహో’ కోసం చిన్న టీజర్ ను షూట్ చేసి ‘బాహుబలి2’ థియేటర్స్ లో ప్రదర్శింపబడేలా చేశారు. దాంతో మొదటి నుండీ ‘సాహో’ సినిమాకి భారీ క్రేజ్ ఏర్పడేలా జరిగింది.

అయితే ఈసారి ‘ప్రభాస్20’ విషయంలో నిర్మాతలు ఆ ఫార్ములాని అప్లై చెయ్యడం లేదు. ఫస్ట్ లుక్ కాదు కదా.. కనీసం టైటిల్ ను కూడా రివీల్ చెయ్యడం లేదు. ఇదిలా ఉంటే.. బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు సంబంధించి ఒక్క షెడ్యూల్ కూడా పూర్తిచేసుకోలేదు. అప్పటి వరకూ చేసిన షూట్లోనే… ఫ్యాన్స్ కోసం బాలయ్య బర్త్ డే రోజున అద్భుతంగా టీజర్ ను కట్ చేసి వదిలారు. దాంతో సినిమా పై క్రేజ్ పెరిగింది.మరి ‘రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ‘ప్రభాస్ 20′ షూటింగ్ ఫుటేజ్.. ప్రమోషన్ కు పనికి రావడం లేదా?’ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus