భయంతో వణికిపోతున్న ప్రభాస్ ఫ్యాన్స్!!!

  • August 4, 2016 / 07:31 AM IST

టాలీవుడ్ లో మోస్ట్ ట్యాలెంటెడ్ దర్శకుడు ఎవరు అంటే…ఎక్కువ శాతం ప్రేక్షకులు రాజమౌళి అని చెబుతారు. ఇప్పటివరకూ ఫ్లాప్ అన్న పధం తెలియని జక్కన్న…ప్రస్తుతం తన రెండో బాహుబలిపై పూర్తి ఫోకస్ పెట్టాడు. అయితే అదే క్రమంలో ఈ సినిమా కోసం ప్రభాస్ సైతం ఎంతో కష్ట పడుతున్నాడు. ఇదిలా ఉంటే జక్కన్న అంటే ఎంత గౌరవం ఉందో, అదే క్రమంలో జక్కన్నపై ఒక రూమర్ కూడా ఉంది టాలీవుడ్ లో అదేమిటంటే…రాజమౌళి సినిమా చేసిన హీరోలకు ఆ సినిమా తరువాత వరుస ఫ్లాప్ రావడం ఖాయం. అందుకే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ చాలా భయంగా ఉన్నారు.

బాహుబలి-2 తర్వాత ప్రభాస్ పరిస్థితి ఎలా ఉంటుందో అని భయ పడుతున్నారు. లెక్క ప్రకారం చూస్తే…బాహుబలి-2 కాకుండా ప్రభాస్ చేతిలో ఇద్దరు దర్శకులున్నారు. వాళ్లే సుజీత్, రాధాకృష్ణ కుమార్. వీళ్లిద్దరితో ప్రభాస్ సినిమాలు చేస్తాడు. సెంటిమెంట్ ప్రకారం ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్ అవుతాయేమో అని కంగారు పడుతున్నారు రెబెల్ స్టార్ ఫ్యాన్స్. ఎందుకంటే హిస్టరీ చూసుకుంటే….మగధీర తర్వాత చెర్రీకి భారీ ఫ్లాప్ పడింది. అటు ఎన్టీఆర్ కు కూడా స్టూడెంట్ నంబర్ వన్, యమదొంగ తర్వాత ఫ్లాపులే పడ్డాయి. నానికి అయితే ఈగ తర్వాత అన్నీ ఫ్లాపులే. అంతెందుకు… ప్రభాస్ కు కూడా ఛత్రపతి తర్వాత ఫ్లాపులే పడ్డాయి. అందుకే బాహుబలి-2 తర్వాత ప్రభాస్ ఏమయిపోతాడో అన్న భయంతో ఉన్నారు ఫ్యాస్…మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్ ను ప్రభాస్ బ్రేక చేస్టాడేమొ చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus