‘ఆదిపురుష్‌’ హీరోయిన్‌ రూమర్లపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ హ్యాపీ

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ సినిమా ప్రకటించినప్పటి నుండి అభిమానులు భలే జోష్‌లో ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్‌ నుండి వస్తున్న తొలి బాలీవుడ్‌ (అక్కడి నిర్మాతలు చేస్తున్న) సినిమా ఇది. ఈ సినిమా రాయామణం నేపథ్యంలో సాగుతుందని, సైఫ్‌ అలీఖాన్‌ ఇందులో విలన్‌ అనేసరికి ఆ హుషారు డబుల్‌ అయ్యింది. అయితే ఆ హుషారుకు కామాలు పెట్టేలా ‘సీత’ పాత్రకు సంబంధించిన వార్తలు నిలిచాయి. ఇందులో ప్రభాస్‌ రాముడు అని కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే సీత పాత్ర కోసం బాలీవుడ్‌ భామలను చూస్తున్నారని వార్తలొచ్చాయి.

అనుష్క శెట్టి, అనుష్క శర్మ, కియారా అడ్వాణీ పేర్లు తొలుత వినిపించినా… ఆఖరికి కృతి సనన్‌ను ఫిక్స్‌ చేశారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఎలాంటి గాసిప్స్‌ లేకపోయేసరికి… ఆమెనే ఫిక్స్‌ ఏమో అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు కీర్తి సురేశ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. సీత పాత్రకు కీర్తి అయితే బాగుంటుందని దర్శకుడు ఓం రౌత్‌ అనుకుంటున్నాడట. దీని కోసం ఇప్పటికే కీర్తిని సంప్రదించారట. మరి కీర్తి ఏమంది అనేది తెలియాల్సి ఉంది.

బాలీవుడ్‌ హీరోయిన్లు సీత పాత్రకు సరిపోరు అని అనలేం కానీ… వాళ్లకుండే గ్లామర్‌ డాల్‌ ఇమేజ్‌ సినిమా సందర్భంలో కాస్త ఇబ్బంది పెడుతుందని నెటిజన్లు అనుకున్నారు. తాజాగా కీర్తి సురేశ్‌ను ఆ పాత్ర కోసం పరిశీలిస్తున్నారు అని వార్తలు వచ్చాక ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కాస్త హ్యాపీ అని చెప్పుకోవచ్చు. మరి కీర్తి ఓకే అంటుందా.. ఈ పుకారు నిజమవుతుందా? అనేది చూడాలి. ఒకవేళ ఓకే అయితే కీర్తి ఇమేజ్‌ పాన్‌ ఇండియా రేంజిలో ఎగురుతుంది.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus