Adipurush: ఆదిపురుష్ విడుదలై సరిగ్గా ఏడాది.. ఓం రౌత్ ను మళ్లీ టార్గెట్ చేశారుగా!

ప్రభాస్ (Prabhas) ఓం రౌత్ (Om Raut) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ (Adipurush) సినిమా గతేడాది జూన్ 16వ తేదీన విడుదలై బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ క్రేజ్ వల్ల ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చినా ఈ సినిమా అన్ని వర్గాల ఫ్యాన్స్ ను మెప్పించలేకపోయింది. ఓం రౌత్ చేసిన తప్పుల వల్లే ఈ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ సమయంలో ఓం రౌత్ పై వచ్చిన ట్రోల్స్ అన్నీఇన్నీ కావు.

ఈ సినిమా విడుదలై ఏడాది అవుతున్నా ఇప్పటికీ ఓం రౌత్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కు కోపం చల్లారలేదు. ఓం రౌత్ ప్రభాస్ ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ప్రభాస్ కు ఫ్లాప్ ఇచ్చారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఓం రౌత్ ను టార్గెట్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా వల్ల ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్లతో పని చేయాలంటే అభిమానులు భయపడే పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు.

ఆదిపురుష్ సినిమా భాషతో సంబంధం లేకుండా ఫ్లాప్ గా నిలిచింది. ఆదిపురుష్ సినిమాలో రాముని పాత్ర విషయంలో సైతం ఓం రౌత్ తప్పులు చేశారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా కల్కి సినిమా రిలీజ్ కు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. కల్కి (Kalki2898 AD) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరగనుందని సమాచారం అందుతోంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారని భోగట్టా.

కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించి మరో ట్రైలర్ రిలీజ్ కానుంది. కల్కి సెకండ్ ట్రైలర్ కూడా క్లిక్ అయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రభాస్ మైథలాజికల్ ప్రాజెక్ట్స్ లో నటించే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus