Prabhas: ఆదిపురుష్ విషయంలో జరిగిన తప్పు చేయొద్దంటున్న ఫ్యాన్స్.. ఏమైందంటే?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. మరో మూడు నెలల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. అయితే ఆదిపురుష్ మూవీ ఐమ్యాక్స్ లలో రిలీజ్ కాలేదనే సంగతి తెలిసిందే. ఇలా జరగడం వల్ల కలెక్షన్ల విషయంలో ఈ సినిమా భారీ స్థాయిలో నష్టపోయింది. అయితే ఆదిపురుష్ విషయంలో జరిగిన తప్పు సలార్ విషయంలో మాత్రం జరగకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సలార్ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఇదేనని సరికొత్త కలెక్షన్లను ఈ సినిమా క్రియేట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్ లో సైతం సలార్ పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానుండగా ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.

ఆదిపురుష్ సినిమాకు ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదనే సంగతి తెలిసిందే. ప్రభాస్ కథల ఎంపికలో, డైరెక్టర్ల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభాస్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో పెరుగుతోంది. ప్రభాస్ వివాదాలకు దూరంగా ఉంటూ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సలార్ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా ఆ అంచనాలను అందుకుని ప్రేక్షకులను మెప్పించాలని ఆశిద్దాం.

ప్రభాస్ (Prabhas) కెరీర్ విషయంలో ఇతర హీరోలకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. వేగంగా ప్రాజెక్ట్ లను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus