Prabhas: రాధేశ్యామ్ ట్రైలర్ పై ఫ్యాన్స్ స్పందన ఇదే!

జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రాధేశ్యామ్ తెలుగు ట్రైలర్ కు 8.7 మిలియన్ల వ్యూస్ రాగా హిందీ ట్రైలర్ కు 8.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. క్లాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను రాధేశ్యామ్ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఎమోషన్స్ తో నిండిన ట్రైలర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయితే ట్రైలర్ ద్వారా రాధేశ్యామ్ లో ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు ఉండవని ప్రభాస్ ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చేసింది. హై మూమెంట్స్ కూడా ట్రైలర్ లో లేకపోవడం ప్రభాస్ ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోంది. భారీగా అంచనాలను పెంచుకోకుండా వెళితే రాధేశ్యామ్ నచ్చుతుందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా టాలీవుడ్ క్లాసిక్ సినిమాలలో ఒకటిగా నిలుస్తుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ కు రాధేశ్యామ్ గట్టి పోటీని ఇస్తుందా? అనే సందేహాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. మాస్ లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న ప్రభాస్ రాధేశ్యామ్ తో భారీ ప్రయోగం చేస్తున్నారని చెప్పాలి. ట్రైలర్ లో ప్రభాస్, పూజా హెగ్డే మినహా ఇతర పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. మరోవైపు ట్రాజెడీ క్లైమాక్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

రాధేశ్యామ్ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. రాధేశ్యామ్ నైజాం హక్కులు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తీసుకున్నారని సమాచారం. కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న రాధాకృష్ణ కుమార్ రెండో సినిమాగా తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ అంచనాలను మించి విజయం సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది. దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. భిన్నమైన కథను ఎంచుకున్న ప్రభాస్ రాధేశ్యామ్ తో రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus