Prabhas: ప్రభాస్ ఆ విషయంలో మారక తప్పదా?

స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. అయితే ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో దాదాపు అందరు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల అప్ డేట్స్ వచ్చాయి.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాల సర్ప్రైజ్ ల కోసం ప్రభాస్ పుట్టినరోజు వరకు ఆగాల్సిందేనని సమాచారం. అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ 42వ వసంతంలోకి అడుగుపెట్టనుండగా ఆరోజు మూడు సర్ప్రైజ్ లు రానున్నాయని తెలుస్తోంది. రాధేశ్యామ్ మూవీ మేకింగ్ వీడియోతో పాటు టీజర్ ఆరోజు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభాస్ పుట్టినరోజుకు చాలా సమయం ఉండటంతో రాధేశ్యామ్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైతే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

యూవీ క్రియేషన్స్ సైతం రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు పెంచేలా ప్రమోషన్ కార్యక్రమాలను ప్లాన్ చేసినట్టు సమాచారం. సలార్, ఆదిపురుష్ నుంచి పోస్టర్లు లేదా టీజర్లు ఆరోజు రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఒక్కో సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. రాధేశ్యామ్ లో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా సలార్ సినిమాలో శృతిహాసన్, ఆదిపురుష్ సినిమాలో కృతిసనన్ నటిస్తున్నారు. తన సినిమాల అప్ డేట్స్, ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ మారాలని వేగం పెంచాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus