Prabhas: ఆదిపురుష్ లో ఆయన నిజంగా నటిస్తున్నారా?

సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు తప్పనిసరిగా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. పైకి చెప్పకపోయినా సెంటిమెంట్లను పాటించే స్టార్ హీరోలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అదే సమయంలో ప్రేక్షకులు కూడా డైరెక్టర్లు, హీరోయిన్లు, ఇతర నటీనటుల విషయంలో సెంటిమెంట్లను పాటిస్తారు. ప్రభాస్, కృష్ణంరాజు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవలేదు. ఈ కాంబినేషన్ లో వచ్చిన బిల్లా సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా రెబల్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఈ కాంబినేషన్ లో తెరకెక్కి ఈ ఏడాది విడుదలైన రాధేశ్యామ్ కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్ లో కూడా కృష్ణంరాజు నటిస్తున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఆదిపురుష్ మూవీలో జనక మహారాజు పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే కృష్ణంరాజు నటించడం తమకు ఇష్టం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకుని కృష్ణంరాజు ఈ సినిమాలో నటించకుండా ఉంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే కృష్ణంరాజు ఈ సినిమాలో నటించారో లేదో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సెంటిమెంట్లకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నారు. సాహో, రాధేశ్యామ్ సినిమాల ఫలితాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచిన నేపథ్యంలో ప్రభాస్ కూడా సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది.

ఆదిపురుష్ సినిమా ఏకంగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఓం రౌత్ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా భారీ సెట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus