ఒకప్పుడు మన దేశ సినిమా గురించి మాట్లాడాలి అంటే బాలీవుడ్‌తోనే స్టార్ట్ చేసేవారు. నిజానికి మన సినిమా అంటే బాలీవుడ్ సినిమానే అని చెప్పేవారు కూడా. అంతలా బాలవుడ్ సినిమా ఆధిపత్యం కొనసాగింది. అయితే కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత మొత్తంగా సిట్యువేషన్ మారిపోయింది. ఒకప్పుడు ఎలాంటి సినిమా తీసినా హిట్ పక్కా అనుకునే చోట.. ఏ సినిమా తీసినా విజయం కష్టమే అనేలా మారిపోయింది. అయితే 2025 బాలీవుడ్‌లో చాలా మార్పునే తీసుకొచ్చింది. గతేడాది వచ్చిన సినిమాలు మంచి విజయాన్నే అందుకున్నాయి.
ఇప్పుడు ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసేసింది ఓ బాలీవుడ్ సినిమా. అది కూడా నాన్ పాన్ ఇండియా మూవీతో. ఆ సినిమానే ‘ధురంధర్’. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా ఇంకా బాలీవుడ్‌లో తన హవా చూపిస్తూనే ఉంది. ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.1300కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయని టీమ్ చెబుతోంది. ఇక అమెరికాలో 21 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే ‘బాహుబలి: ది కంక్లూజన్’ రికార్డు బద్ధలైనట్లే. ఆ సినిమా 20.7 మిలియన్లు వసూళ్లు అందుకున్న విషయం తెలిసిందే.
దీంతో గత తొమ్మిది ఏళ్లుగా ఈ రికార్డును ఏ చిత్రమూ బ్రేక్ చేయలేని రికార్డు ఇప్పుడు ‘ధురంధర్’ అందుకుందన్నమాట. ఇక మన దేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగానూ ‘ధురంధర్’ రికార్డు సృష్టించింది. యూఎస్ సంగతి చూస్తే ‘ధురంధర్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత ‘కల్కి 2898 ఏడీ’ (18.5 మిలియన్ డాలర్లు), ‘పఠాన్’ (17.5 మిలియన్ డాలర్లు), ‘జవాన్’ (15.6 మిలియన్ డాలర్లు) సినిమాలు ఉన్నాయి.
‘ధురంధర్’ రెండో పార్టు మార్చి 19న విడుదల చేయనున్నారు. ఆ సినిమాతో ఈసారి ఏకంగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ వరల్డ్ వైడ్ కలక్షన్‌ను దాటేయాలని చూస్తున్నారు. ఏమాటకామాట పాన్ ఇండియా లెవల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘బాహుబలి ది కంక్లూజన్’ ఓవర్సీస్ రికార్డును ఓ బాలీవుడ్ సినిమా కొట్టడం పెద్ద విషయమే. ఇక ఈ సినిమా జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వస్తుందని టాక్.
బన్నీ సినిమా లోకేశ్ కలల ప్రాజెక్టేనా? టీజర్ అలా లేదు కానీ.. చర్చ అలానే..