ప్రతి దర్శకుడికీ ఓ కలల ప్రాజెక్ట్ ఉంటుంది. పెద్ద దర్శకుల కలల ప్రాజెక్ట్‌కి ఎప్పుడూ హైప్ ఉంటుంది. అందుకే రాజమౌళి ‘మహాభారతం’ గురించి అంతగా మాట్లాడుకుంటున్నాం. అలా లోకేశ్ కనగరాజ్‌కి కూడా ఓ కలల ప్రాజెక్ట్ ఉంది. అదే ‘ఇరుంబు కై మాయావి’. అంటే ఇనుము చేయి ఉన్న మాయగాడు అని అర్థం. అంటే అనుకోని పరిస్థితుల్లో చేతిని కోల్పోయిన హీరో.. ఇనుప చేతిని సిద్ధం చేసుకొని దాంతో ఏం చేశాడు అనేదే కథ. చెప్పడానికి చిన్న పాయింట్‌లా ఉన్నా.. ఇది చాలా పెద్ద అని అంటుంటారు.
ఇప్పుడు ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఆయన నుండి రీసెంట్‌గా అనౌన్స్ అయిన అల్లు అర్జున్ సినిమా. ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేస్తారు అని మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. టీజర్‌లో పెద్దగా విషయాలు చెప్పకపోయినా నక్కల్ని వేటాడే పులి కథ అది ఈ సినిమా అని స్థూలంగా అర్థమవుతోంది. లోకేశ్ కలల ప్రాజెక్ట్ ‘ఇరుంబు కై మాయావి’ ఇదే అని చర్చ నడుస్తోంది.
నిజానికి ఈ కథను లోకేశ్ కనగారజ్ తన కెరీర్ తొలి రోజుల్లోనే రాసుకున్నారు. ఓ నవల ఆధారంగా సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఈ మేరకు సూర్య హీరోగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వరకు వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత ఆమిర్ ఖాన్ హీరోగా చేస్తారనే టాక్ నడిచింది. అంతా ఓకే ‘కూలీ’ తర్వాత ఈ సినిమానే అన్నారు కూడా. కానీ వివిధ కారణాలు, బడ్జెట్ వల్ల ఆ సినిమా అవ్వలేదు. దీంతో బన్నీ హీరోగా చేస్తున్నారని టాక్.
అయితే, ‘ఇరుంబు కై మాయావి’ సినిమా అడవి నేపథ్యంలో ఉండదు అని ఓ టాక్. అదే జరిగితే బన్నీ సినిమా అది అవ్వకపోవచ్చు. అయితే మరేం కథ. అందులోనూ ఇంత తక్కువ టైమ్‌లో బన్నీని ఇంప్రెస్ చేసిన ఆ లైన్ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. అన్నట్లు మరోసారి బన్నీ అడవి బాటపడుతున్నాడు ‘పుష్ప’ సినిమాల తర్వాత.