Prabhas: గుర్తుపెట్టుకుంటాం అంటూ ఫ్యాన్స్ వార్నింగ్.. ఏమైందంటే?

ఏపీ ప్రభుత్వం స్టార్ హీరోల సినిమాల బెనిఫిట్ షోల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలకు ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వలేదు. ఓవర్సీస్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రేక్షకులు ఏపీ ప్రేక్షకుల కంటే ముందుగానే పెద్ద సినిమాలను థియేటర్లలో చూస్తున్నారు. ఏపీలో మార్నింగ్ షో మొదలయ్యే సమయానికి సినిమాల టాక్ తో పాటు రివ్యూలు కూడా వచ్చేస్తున్నాయి. ఫేవరెట్ హీరోల సినిమాలను త్వరగా చూడాలనే ఫ్యాన్స్ కోరికకు ప్రభుత్వం ఆంక్షలు బ్రేకులు వేస్తున్నాయి.

Click Here To Watch Now

ఏపీ ప్రభుత్వం కొత్త టికెట్ల జీవోలో బెనిఫిట్ షోల గురించి అస్సలు ప్రస్తావించలేదనే సంగతి తెలిసిందే. అయితే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ప్రాంతంలో రాధేశ్యామ్ సినిమా బెనిఫిట్ షో వేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకోవడంతో పాటు ఆ థియేటర్ కు తాళాలు వేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం వైరల్ కాగా ఈ ఘటన ప్రభాస్ అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది.

ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి ఒకింత ఘాటుగానే స్పందించారు. రాధేశ్యామ్ బెనిఫిట్ షో ప్రదర్శించిన థియేటర్ కు తాళాలు వేయడాన్ని తాము గుర్తుపెట్టుకుంటామని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆంక్షలు భవిష్యత్తు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు రాధేశ్యామ్ ఫస్ట్ వీకెండ్ నాటికి కనీసం 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాల్సి ఉంది. రాధేశ్యామ్ కు కలెక్షన్ల విషయంలో టార్గెట్ ఎక్కువగా ఉండటం గమనార్హం.

శని, ఆదివారాల్లో కూడా రాధేశ్యామ్ కు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. భారీగా అంచనాలు పెట్టుకోకుండా వెళితే రాధేశ్యామ్ ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయదని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రేమికులకు, క్లాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండటం గమనార్హం. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు యావరేజ్ రేటింగ్ తో రివ్యూలు వచ్చాయి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus