FAUJI: ‘కాంతార’ రూట్లో ప్రభాస్ ‘ఫౌజీ’.. ఇది మామూలు స్కెచ్ కాదు!

బాక్సాఫీస్ దగ్గర విజయం కనిపిస్తే చాలు, ఆ కథను సాగదీయడానికి మనోళ్లు రెడీ అయిపోతారు. రిషబ్ శెట్టి ‘కాంతార’ మ్యాజిక్ తర్వాత ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. అసలు ప్లాన్ లో లేకపోయినా, సక్సెస్ రాగానే ఆ బ్రాండ్ ఇమేజ్‌ని వాడుకోవడానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ అని కలరింగ్ ఇవ్వడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. సరిగ్గా ఇదే ఫార్ములాను ఇప్పుడు ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న ‘ఫౌజీ’కి కూడా అప్లై చేయబోతున్నారట.

FAUJI

‘కాంతార’ రిలీజ్‌కు ముందు అది ఒక చిన్న సినిమా. కానీ అది సెన్సేషనల్ హిట్ అయ్యాక సీన్ మారింది. వెంటనే ‘కాంతార చాప్టర్ 1’ అంటూ ప్రీక్వెల్ అనౌన్స్ చేశారు. నిజానికి ఆ రెండు కథలకు కొన్ని చిన్న లింక్స్ తప్ప పెద్ద సంబంధం ఉండకపోవచ్చు. కానీ ఆ ‘హిట్’ అనే బ్రాండ్ జనాలను మళ్ళీ థియేటర్లకు రప్పిస్తుంది. దర్శకుడు హను రాఘవపూడి కూడా ఇప్పుడు ప్రభాస్ సినిమా విషయంలో ఇదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని చూస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది ఆగస్టులో రాబోతున్న ‘ఫౌజీ’ రిజల్ట్ ఇంకా తేలలేదు. కానీ అప్పుడే దీనికి సంబంధించిన మరో కథను, అంటే ప్రీక్వెల్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అయితే, వెంటనే రెండో భాగం (ప్రీక్వెల్ రూపంలో) అనౌన్స్ చేసి, ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనేది మాస్టర్ ప్లాన్. ఇది వినడానికి బాగున్నా, ఇందులో చాలా పెద్ద రిస్క్ దాగుంది.

సినిమా రిలీజ్ కాకుండానే పార్టులు ఉంటాయని ప్రకటించడం కత్తి మీద సాము లాంటిదే. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ విషయంలో ఇదే తప్పు చేశాడు. మూడు భాగాలు ఉంటాయని ముందే డప్పు కొట్టాడు, కానీ ఫస్ట్ పార్ట్ రిజల్ట్ తేడా కొట్టడంతో ఇప్పుడు సీక్వెల్స్ అటకెక్కాయి. ఇప్పుడు హను కూడా తొందరపడి అనౌన్స్ చేస్తే, రేపు రిజల్ట్ ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది.

ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇలాంటి ప్రయోగాలకు ఒప్పుకోవాలంటే ముందు ‘ఫౌజీ’ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించాలి. సక్సెస్ అయితేనే ప్రీక్వెల్ ఆలోచనకు విలువ ఉంటుంది. లేదంటే అదొక బ్యాడ్ ఐడియాగా మిగిలిపోతుంది. మరి హను ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags