ఆ హీరోయిన్ కి ప్రభాస్ వీరాభిమాని!

హిట్స్ కంటే ముందే తన కటౌట్ తో రాష్ట్రమంతా అభిమానులను సొంతం చేసుకున్న హీరో ప్రభాస్. బాహుబలితో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ. అటువంటి డార్లింగ్ కి ఒకరంటే పిచ్చి. ఆమెకు రెబల్ స్టార్ వీరాభిమాని. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా రవీనా టండన్. హిందీలో అనేక చిత్రాలు చేసిన ఈ బ్యూటీ.. తెలుగులోనూ బాలకృష్ణ సరసన నటించింది. హీరోగా కాకముందు నుంచి ఆమెకు ప్రభాస్ ఫ్యాన్. “అందాజ్‌ అప్నా” చిత్రంలోని ‘ఎలో జీ సనమ్‌’ పాట ప్రతీ క్షణం తనని వెంటాడుతుందని ప్రభాస్ కొన్నిసార్లు చెప్పారు.

ఇండియన్ స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా అభిమానిగా చెప్పుకోవడమే కాదు.. ఆమెను కలిసి ఆ విషయాన్నీ స్వయంగా చెప్పారు. బాహుబలి కంక్లూజన్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారిలో రవీనా టండన్  భర్త అనిల్‌ టండానీ ఉన్నారు. ఆ రకంగా పరిచయం ఏర్పడింది. ఈ మధ్య  ఓసారి డిన్నర్‌ కోసం ప్రభాస్‌ వారి ఇంటికి వెళ్లి రవీనాతో సెల్ఫీలు దిగి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ప్రభాస్ సినిమా విషయానికి వస్తే.. సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న సాహో మూవీ షూటింగ్ వేగంగాసాగుతోంది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా శ్రద్ధ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్, హాలీవుడ్ ఆర్టిస్టులు, నిపుణులు పనిచేస్తున్న సాహోపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus