అనుష్క విషయంలో రాజమౌళిని కూడా లాగింది అందుకే..?

టాలీవుడ్ లో మాత్రమే కాదు ‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులందరూ ‘డార్లింగ్’ అని పిలుచుకునే ప్రభాస్ చూడటానికి 6.2 హైట్ తో హ్యాండ్సమ్ హంక్ కనిపిస్తాడు అనడంలో సందేహం లేదు. సాధారణంగా ప్రభాస్ కు బాగా సిగ్గు… కాబట్టి ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు కాదని టాలీవుడ్ లో టాక్ నడిచేది. అయితే ‘బాహుబలి’ తరువాత ఇంటర్వ్యూలకు బాగానే ఇవ్వడం విశేషం. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ అనే ఇంటర్వ్యూ కు హాజరయ్యారు ప్రభాస్,రానా, రాజమౌళి. ఈ ఇంటర్వ్యూలో కరణ్ జొహార్ అడిగిన ప్రశ్నలకి తన స్టైల్ లో ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చాడు ప్రభాస్.

రానా, రాజమౌళి కూడా కరణ్ తో ఫన్నీ.. ఫన్నీ.. ఆన్సర్స్ ఇస్తూ హుషారు రేకేత్తించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా.. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో కరణ్ ప్రశ్నిస్తూ .. “టాలీవుడ్లో సెక్సీయెస్ట్ హీరోయిన్ ఎవరు?” అనే ప్రశ్నకి ప్రభాస్ సమాధానమిస్తూ .. ‘అనుష్క’ పేరు చెప్పాడు. అంతేకాదు కరణ్ మరో ప్రశ్నగా “కాజల్ .. తమన్నా .. అనుష్క .. ఈ ముగ్గురిలో హీరోయిన్ గా ఎంచుకోవాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు?” అని అడిగిన ప్రశ్నకి ప్రభాస్ .. ‘అనుష్క’ పేరే చెప్పాడు. ప్రభాస్ దీనికి వివరణ ఇస్తూ .. అనుష్క మంచి నటి .. అందుకే తన పేరు చెప్పానని తెలిపి… , నాకే కాదు .. రాజమౌళి ఫేవరేట్ హీరోయిన్ కూడా అనుష్క నే… ‘ అంటూ నవ్వించాడు.గత కొంత కాలంగా ప్రభాస్ – అనుష్క మధ్య ప్రేమాయణం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి కాబట్టి, వాటిని దృష్టిలో పెట్టుకునే ప్రభాస్ ఇలా అనుష్క పేరు విషయంలో రాజమౌళిని కూడా లాగినట్టు తెలుస్తోంది. ఇంటర్వ్యూ మొత్తం ఇలా ఒకరి మీద ఒకరు కౌటేర్లు వేసుకుంటూ.. సరదా.. సరదాగా.. గడపడం విశేషం. ఇక ప్రభాస్ ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ డైరెక్షన్లో ‘సాహూ’ చిత్రంతోనూ.., రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం తోనూ బిజీగా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus