ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా రామ్ లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది ప్రముఖులు రామ్ లీలా మైదానంలోకి చేరుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా జరిపిస్తారు. ఇకపోతే గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించలేకపోయారు. అయితే ఈ ఏడాది మాత్రం రావణ దహన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపారని తెలుస్తోంది.
ఇకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ నటుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ హాజరయ్యారు. రామ్ లీలా మైదానం కమిటీ వారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రభాస్ విల్లు ఎక్కి పెట్టి రావణాసురుడిని దహనం చేశారు. ప్రభాస్ విల్లు ఎక్కి పెట్టి విడవగా రావణాసురుడు దహనం అయ్యారు. ప్రస్తుతం ఈ రావణ దహన కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ప్రభాస్ తాజాగా ఆది పురుష సినిమాలో రాముడి పాత్రలో నటిస్తుండడంతో ఈ కార్యక్రమానికి ఈయన ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ అయోధ్యలోని సరియునది తీరాన విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే రామ్ లీలా మైదానంలో కూడా ఆది పురుష్ చిత్ర బృందం సందడి చేశారు.
సాధారణంగా ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. అయితే సౌత్ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఏ హీరో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు అలాంటి ఘనత గౌరవం అందుకున్న మొదటి హీరో ప్రభాస్ అని చెప్పాలి. ఇలాంటి అరుదైన గౌరవం ప్రభాస్ కి దక్కినందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!