Prabhas: ఐరన్ మ్యాన్ ను తలపిస్తున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్!

  • July 19, 2023 / 04:47 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బానర్ పై ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్టుకే. ఈ సినిమా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైనది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

టైం ట్రావెల్ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియోని అన్ని భాషలలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అదిరిపోయే లుక్ లో అచ్చం ఐరన్ మ్యాన్ ను తలపిస్తూ ఉన్నటువంటి ప్రభాస్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతంలో ప్రభాస్ ఏ సినిమాలోనూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.ప్రభాస్ లుక్ కి ఇండియన్ ఇతిహాస టచ్ ఇస్తూనే మోడరన్ డ్రెస్ లో చూపించారు. లాంగ్ హెయిర్ తో జటాజూటధారిగా ప్రభాస్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ పోస్టర్ పై విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ అమితాబ్ దీపికా పదుకొనే వంటి స్టార్ సెలబ్రెటీలు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు. తాజాగా ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus