ప్రభాస్ మూవీ కోసం రంగస్థలాన్ని మించిన సెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా షూటింగ్ స్టడీగా సాగుతోంది. హడావుడిగా కంటే అవుట్ పుట్ సాలిడ్ గా ఉండేలా సుజీత్ కష్టపడుతున్నారు. ఇందుకు షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ భారీగా ఉండనుంది. అందుకే ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ మరో మూవీని పట్టాలెక్కించనున్నారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో 20 వ చిత్రం చేయనున్నారు. ఇది రంగస్థలం మాదిరిగానే అలనాటి కాలంలో సాగే కథ. 1970 నాటి కాలంలో కథ సాగుతుందని సమాచారం. అందుకోసం ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ సెట్స్ డిజైన్స్ చేస్తున్నారు. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా దీని కోసం భారీ సెట్టింగ్స్ వేయబోతున్నారు.

“రంగస్థలం” సినిమాలో మాదిరే హైదరాబాద్ శివార్లలో భారీ విలేజ్ సెట్టింగ్ వేయిస్తున్నట్లు సమాచారం. “రంగస్థలం” సెట్టింగ్ వేసిన బూత్ బంగ్లా ప్రాంతంలోనే ఈ సెట్టింగ్ కూడా వేస్తున్నారట. రంగస్థలం గ్రామానికి ఏమాత్రం తీసిపోని రీతిలో సహజంగా.. అందంగా సెట్టింగ్ తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి 2 కోట్ల దాకా ఖర్చు చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సెట్ లో రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలు కాబోతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus