టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ఇతర హీరోలతో సైతం సన్నిహితంగా మెలుగుతారు. ఇండస్ట్రీలో ప్రభాస్ కు ఎక్కువ సంఖ్యలో స్నేహితులు ఉన్నారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ స్నేహితులలో ఒకరైన నటుడు రాజా శ్రీధర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వెల్లడించారు. సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ లో నేను, ప్రభాస్ క్లాస్ మేట్స్ అని ఆయన అన్నారు. నేను మొదట హీరో అయ్యానని ఆ తర్వాత ప్రభాస్ హీరో అయ్యాడని రాజా శ్రీధర్ తెలిపారు.
నా తొలి సినిమా సెట్స్ కు ప్రభాస్ వచ్చారని ఆయన కామెంట్లు చేశారు. ప్రభాస్ కు మొహమాటం, సిగ్గు ఎక్కువ అని ఆయన చెప్పుకొచ్చారు. నేను తొలి సినిమాలోనే లిప్ లాక్ సీన్స్ లో నటించడంపై ప్రభాస్ సెటైర్లు వేసేవారని రాజా శ్రీధర్ వెల్లడించారు. వీడు నాకన్నా ముందు హీరో అని ప్రభాస్ నా గురించి చెబుతారని రాజా శ్రీధర్ పేర్కొన్నారు. నేను తక్కువ రోజులు ట్రైనింగ్ తీసుకున్నానని మా బ్యాచ్ లో ప్రభాస్ బెస్ట్ స్టూడెంట్ అని రాజా శ్రీధర్ కామెంట్లు చేశారు.
నా బెస్ట్ స్టూడెంట్స్ లో ప్రభాస్ ఒకరని సత్యానంద్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారని రాజా శ్రీధర్ వెల్లడించారు. కెమెరా ముందుకు వెళ్తే ప్రభాస్ వేరే పర్సన్ అని ఆయన కామెంట్లు చేశారు. ప్రభాస్ సినిమాలలో నాకు బాహుబలి ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. పౌర్ణమి, మున్నా, డార్లింగ్ సినిమాలలో ప్రభాస్ తో కలిసి నటించానని యూవీ బ్యానర్ లో కూడా నాకు అవకాశాలు వచ్చాయని రాజా శ్రీధర్ వెల్లడించారు.
స్నేహితుల విషయంలో ప్రభాస్ (Prabhas) ఎంతో కేర్ తీసుకుంటారని ఆయన అన్నారు. ప్రభాస్ పెళ్లి కోసం మేము కూడా ఎదురుచూస్తున్నామని రాజా శ్రీధర్ తెలిపారు. ప్రభాస్ కు పెళ్లి కుదిరితే మాకే ఎక్కువ పనులు ఉంటాయని ఆయన కామెంట్లు చేశారు.