కొంచెం బరువు పెరిగిన ప్రభాస్

ప్రభాస్ కి ఉన్న ప్రధాన ఎసెట్ ఫిజిక్. సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తన బాడీని ఫిట్ గా మెయిన్ టైన్ చేస్తూ వస్తున్నారు. బాహుబలి సినిమాకోసమైతే సిక్స్ ప్యాక్ బాడీని రప్పించారు. ఐదేళ్లపాటు ఆ లుక్ ని కొనసాగించారు. ఆ చిత్రం తర్వాత రిలాక్స్ అయ్యారు. తర్వాత సినిమా కోసం అల్ట్రా స్టైలిష్ లుక్ రప్పించారు. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాలో ఆ లుక్ తో ఆకట్టుకోనున్నారు. అయితే స్టైల్ లుక్ పాటల్లో మాత్రమే ఉంటుందంట. యాక్షన్ సీన్స్ కోసం కొంచెం బరువు పెరిగి కండలు పెంచారని తెలిసింది. అందుకోసం విదేశాల్లో నిపుణుల సలహాలు తీసుకున్నట్లు సమాచారం.

ఈ రెండు లుక్స్ అభిమానులకు కొత్త అనుభూతిని పంచనుంది. ఏకకాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న సాహో సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్, విలన్స్ గా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లు నటిస్తున్నారు. కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ ను ఓ కీలక రోల్ పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం లో గాల్లో విన్యాసాలు మాత్రమే కాదు, అండర్ వాటర్ లో ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ఉంది. అందుకోసం ప్రభాస్ అండర్ వాటర్ డైవింగ్ (స్కూబా డైవింగ్ ) నేర్చుకున్నారు. ఈ సన్నివేశాన్ని త్వరలో తెరకెక్కించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus